Bank Charges: బ్యాంకులు బాదుడు షురూ..అవి 5 కంటే ఎక్కువైతే అంతే ఇక.. బాదుడే బాదుడు!
Bank Charges: బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్లాక్ మనీని బయటకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. 2016లో పెద్ద నోట్లను రద్దు చేసి..ఎక్కువగా డిజిటల్ కరెన్సీ వైపు మొగ్గు చూపే విధంగా చేశారు.
అప్పటి నుంచి డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. దీనికి తోటు డిజిటల్ ప్లాట్ ఫాంలు అయిన ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి వాటికి విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. ఒక అకౌంట్ నుంచి డబ్బులను మరో అకౌంట్ ని ట్రాన్స్ ఫర్ చేయడం అనేది మరింత సులువు అయిపోయింది.
బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయాయి. ఒకప్పుడు డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేయాలంటే.. క్యూలో నిల్చొని.. గంటలు గంటలు నిలబడి.. చివరికి పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చే సరికి చాలా సమయం పట్టేది. అంతే డబ్బుల తీసుకోవాలన్నా ఇదే ప్రాసెస్. తర్వాత రోజులు మారాయి. ఏటీఎం సెంటర్లు వచ్చాయి. డిజిటల్ వ్యాలెట్లు వచ్చాయి. దీంతో పని అంతా సులభం అయిపోయింది.
ఇక ఏటీఎం సెంటర్లలో డబ్బులను తీసుకోవాలంటే.. కేవలం 5 ట్రాన్సాక్షన్ల వరకు ఉచితంగా ఉండేది.
తర్వాత ప్రతీ ట్రాన్సాక్షన్‌కు సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే కొత్త సంవత్సరం నేపథ్యంలో ఈ చార్జీలు మరింత పెరిగాయి. ఆర్బీఐ ఆదేశాల మేరకు బ్యాంకులు ఈ చార్జీలను పెంచాయి.
గతంలో ఒక్క ట్రాన్సాక్షన్ కు రూ.20 వసూలు చేసేవారు.. ప్రస్తతుం దానిని రూ.21 చేశారు. పెంచిన చార్జీలు ఇప్పటికే అమలులోకి వచ్చేశాయి. ఈ చార్జీల పెంపు అనేది 2021 జూన్ 10 నే అనుమతులు వచ్చిన న.. జనవరి 1, 2022 నుంచి అమలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…