Sreeja : “మనం ఏమి ఇస్తామో అదే తిరిగి వస్తుంది..” మెగాస్టార్ కూతురు శ్రీజ పెట్టిన పోస్ట్ ఎవరిని ఉద్దేశించి.!?

Sreeja viral social media post : మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ సోషల్ మీడియాలో బాగా చురుగ్గా ఉంటారు తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తనకు సంబంధించిన అప్ డేట్స్ ను ఇస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య శ్రీజ, తన భర్త కళ్యాణ్ దేవ్ విషయం లో తేడా జరిగిందని అందుకే కళ్యాణ్ దూరంగా ఉంటున్నారనే పుకార్లు వినిపించాయి.

Sreeja : మెగాస్టార్ కూతురు శ్రీజ పెట్టిన పోస్ట్ ఎవరిని ఉద్దేశించి.!?

ఇక ఈ పుకార్లకు బలం చేకూరస్తూ శ్రీజ తన సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరును కూడా శ్రీజ కొణిదెల గా మార్చుకుంది దీంతో సందేహాలు ఇంకా ఎక్కువయ్యాయి. ఇక లేటెస్ట్ గా శ్రీజ పెట్టిన పోస్ట్ కూడా ఎవరని ఉద్దెశించి అంటూ నెటిజన్స్ ఆరాలు తీస్తున్నారు. ‘మనం అవతలి వ్యక్తికి మనస్పూర్తిగా ఏదైతే ఇస్తామో.. అదే 100రెట్లు మనకు తిరిగి వస్తుంది’ అంటూ ఓ కొటేషన్‌ను షేర్‌ చేసింది. దీంతో శ్రీజ ఎవరి గురించి ఈ కామెంట్స్‌ చేసింది అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్ అయింది.