MLA Undavalli Sridevi daughter Bhavya : మా విలువ జస్ట్ పది కొట్లేనా… మా అమ్మని ఏడిపించకండి… ఇంట్లో కూర్చుని ఏడుస్తోంది… దారుణంగా తిడుతున్నారు…: ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూతురు భవ్య

MLA Undavalli Sridevi daughter Bhavya : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నది ఉండవల్లి శ్రీదేవి సస్పెన్షన్ గురించి. ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సి ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ కు ఆమె పాల్పడినట్లు వైసీపీ అధినేతకు అనుమానం రావడంతో ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేసారు. ఇక ఆమె గురించి వైసీపీ చోటా మోటా నాయకుల నుండి పార్టీ నేతలు ఉండవళ్ళి శ్రీదేవిని బాగా విమర్శిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే దారుణంగా వైసీపీ సానుభూతి పరుల కామెంట్స్ ఉంటున్నాయి. ఇక ఈ ఇష్యూ మీద తన తల్లిని టార్గెట్ చేస్తున్నారు, దళిత అందులోనూ మహిళ అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటూ ఉండవల్లి శ్రీదేవి కూతురు భవ్య మీడియాతో మాట్లాడుతూ కామెంట్స్ చేసారు.

మా విలువ పది కొట్లేనా…

ఎమ్మెల్యే కూతురు భవ్య మాట్లాడుతూ ఎలక్షన్ అప్పుడు కూడా జగన్ గారితో ఉండవళ్ళి శ్రీదేవి భేటీ సమయంలో అక్కడే తల్లితో ఉన్న భవ్య జగన్ గారు మాతో చాలా బాగా మాట్లాడారంటూ చెప్పారు. సజ్జల గారు, బొత్స గారు ఉన్నారని వాళ్ళు బాగా మాట్లాడారని, ఇన్ని రోజులు మమ్మల్ని బాగా జాగ్రతగా చూసుకున్న జగన్ గారు అసలు ఆధారాలు లేకుండా మా అమ్మాయి క్రాస్ ఓటింగ్ కి పాల్పడిందని ఎలా నమ్మరో అర్థం కావడం లేదంటూ చెప్పారు. మా అమ్మ చేయకపోయినా చేసిందంటూ ఆరోపిస్తున్నారని కనీసం మీరు చేసారా అనే ప్రశ్న కూడా మా అమ్మాను అడగకుండా తాను ఏం చెప్తుందో వినకుండా నువ్వు చేసావ్ అంటూ మాట్లాడుతున్నారు. ఒక దళిత అందులోనూ మహిళ అని చాలా దారుణంగా తిడుతున్నారు.

నా చెల్లి ఇంటర్ చదువుతోంది. తాను ఎక్సామ్ రాయకుండా ఇంట్లో కూర్చొని ఏడుస్తోంది. బయటకు వెళితే ఎవరు ఏమంటారో అనే భయంతో ఇంట్లో కూర్చుంది. మా ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరూ డాక్టర్స్, నేను డాక్టర్ చదువుతున్నాను, ఇక నా చెల్లి భవిష్యత్తులో డాక్టర్ అవుతుంది. బాగా చదువు ఉన్న కుటుంబం, బాగా సెటిల్ అయిన వాళ్ళం. అలాంటిది మా అమ్మ ఎందుకు పది కోట్ల కోసం అలా చేస్తుంది. మరీ పది కోట్లు కాకుండా ఒక 150 కోట్లన్నా అనుంటే బాగుండేది, మరీ మా విలువ పది కోట్లా అంటూ మాట్లాడారు భవ్య.