Brahmanandam: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా సుమారు 1200 కు పైగా సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఎన్నో అవార్డులను పురస్కారాలను అందుకున్నటువంటి కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బ్రహ్మానందం తాజాగా రంగమార్తాండ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమాలో ఈయన కమెడియన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అవ్వడంతో పలువురు సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు ఈ సినిమాపై బ్రహ్మానందం నటనపై ప్రశంసలు కురిపించారు.ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అవ్వడంతో బ్రహ్మానందం ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలను తెలియజేశారు.ముఖ్యంగా తన జీవితంలో తాను పడినటువంటి కష్టాల గురించి ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తనకు ఒకప్పుడు రెండు పూటల తినడానికి తిండి కూడా దొరికేది కాదని బ్రహ్మానందం తెలిపారు. ఇలాంటి కష్ట సమయంలోనే తాను ఎంఏ పూర్తి చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు.ఇలా ఒకప్పుడు డబ్బు కోసం ఎంతో కష్టపడ్డాను అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చిన తరువాత పేరును కాపాడుకోవడం కోసం కష్టపడుతున్నానని తెలిపారు.
తాను ఇండస్ట్రీలో ఈ స్థాయిలోకి వచ్చిన తర్వాత చాలామంది తన ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోయారని బ్రహ్మానందం తెలిపారు. ఇండస్ట్రీలోకి సుధాకర్ కమెడియన్ గా వచ్చినప్పుడు ఇక బ్రహ్మానందం పని అయిపోయిందని చాలామంది అన్నారు.అలాగే బాబు మోహన్ ఎల్బీ శ్రీరామ్ పృద్వి వంటి వారు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత బ్రహ్మికి సినిమా అవకాశాలు తగ్గిపోయాయని ఇక తన కెరియర్ అయిపోయినట్లేనని చాలామంది అనుకున్నారని అయితే వాటన్నింటినీ దాటుకొని నేను ఈ స్థాయిలో ఉన్నానని ఈ సందర్భంగా బ్రహ్మానందం చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…