Malla Reddy: మేమే ఫేమస్ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన యువతను ఉద్దేశించి పలు విషయాలను తెలియజేశారు.తెలంగాణలో యువత చాలా మంది ఉన్నారని అయితే వారందరూ కూడా చిరిగిన జీన్స్ వేసుకొని అమ్మాయిలు చుట్టూ తిరిగితే ఫేమస్ కారని కష్టపడి పని చేస్తేనే ఫేమస్ అవుతారని తెలిపారు.
నేను కూడా ఒకప్పుడు పాలు అమ్ముకుంటూ బ్రతికేవాడిని కానీ కేసీఆర్ దయవల్ల మంత్రిని అయ్యానని తెలిపారు. ఇక సినిమాల గురించి మల్లారెడ్డి మాట్లాడుతూ… వచ్చే ఎన్నికలు పూర్తి అయిన తర్వాత తాను తెలంగాణ యాసలో కొన్ని సినిమాలను నిర్మిస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమాలో నటించమని అవకాశాలు కూడా కల్పించారని ఈయన తెలిపారు.
డైరెక్టర్ హరీష్ శంకర్ తన ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో ఆయనకు విలన్ గా నటించాలని కోరారు. ఇలా దాదాపు హరీష్ శంకర్ ఒక గంటపాటు నన్ను ఈ సినిమాలో నటించమని బ్రతిమలాడారు అంటూ మల్లారెడ్డి వెల్లడించారు.అయితే తాను సినిమాలలో నటించడానికి నో చెప్పానని ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ వంటి సినిమాని చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి డైరెక్టర్ హరీష్ శంకర్ ఆయనతో తిరిగి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులను కూడా ప్రారంభించుకోబోతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…