Samantha: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమా షూటింగ్ పనులతో ఎంతో బిజీగా గడుపుతున్న సమంత ప్రస్తుతం తాను నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సమంత యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సమంత పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఇకపోతే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి సమంతకు సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఒక వీడియోని షేర్ చేస్తూ.. నేను మీకు చెప్పే అంత చనువులేదని నాకు తెలుసు అయినా మీరు ఎవరితోనైనా డేటింగ్ చేయండి ప్లీజ్ అంటూ ఈమెకు సలహా ఇచ్చారు. అయితే నేటిజన్ చేసిన ట్వీట్ కి సమంత సమాధానం ఇస్తూ మీకన్నా నన్ను ఎవరు ఎక్కువగా ప్రేమించగలరు అంటూ లవ్ ఎమోజీలను షేర్ చేస్తూ రిప్లై ఇచ్చారు.
ఇలా సమంత అభిమానులే తనని ఎక్కువగా ప్రేమించగలరు అంటూ చెప్పినటువంటి ఈ కామెంట్స్ విన్న అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా సమంత చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…