Featured

Ambika Krishna : చిరంజీవికి ఆ పని చేత కాలేదు… ఆ హీరోయిన్ కి ఉన్న పొగరు వల్లే… ఇప్పుడు సినిమా అవకాశాలు లేకుండా పోయాయి…: ప్రొడ్యూసర్ అంబిక కృష్ణ

Ambika Krishna : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కి చెందిన అంబికా కృష్ణ అంబికా థియేటర్ నిర్వహిస్తూ, అంబికా దర్భార్ భక్తి అగరవత్తుల ఫ్యాక్టరీ ఓనర్ గా కొనసాగుతూ, సినిమా నిర్మాతగా కొన్ని సినిమాలను నిర్మించారు. కన్యాదానం, ఆడంతే అదో టైపు, జంప్ జిలాని, వీరభద్ర, ఒకే మాట, మనసున్న మారాజు వంటి సినిమాలను నిర్మించారు. తెలుగుదేశం పార్టీలో చేరి పలు పదవులలో కొనసాగారు. ఇక సినిమాలు, హీరోలు, డైరెక్టర్ల గురించి మాట్లాడారు.

ఆ హీరోయిన్ కి పొగరు…

హీరోయిన్ల గురించి ప్రస్థావిస్తూ ‘వీరభద్ర’ సినిమా సమయంలో హీరోయిన్ తను శ్రీ దత్త చేసిన పనుల గురించి కామెంట్స్ చేసారు. విదేశాల్లో షూటింగ్ షెడ్యూల్ జరుగుతుండగా ఉదయాన్నే షూటింగ్ కి సూట్ కేసు సర్దుకుని వచ్చింది. ఇంకాసేపటిలో షూటింగ్ మొదలవుతుంది అనగా నేను ఇండియా వెళ్ళాలి టికెట్ వేయమని అడిగింది. మా నాన్నకు సీరియస్ గా ఉంది వెళ్ళాలి అని చెప్పింది. హీరోతో సహా అందరూ షూటింగ్ కి ఎదురుచూస్తుంటే వినకుండా వెళ్లాలని పట్టుబట్టింది. ఇక ఒక పూట అంతా మాట్లాడి వాళ్ళ నాన్నతో మాట్లాడించి పర్వాలేదు అన్నాక వెళ్లడం మానుకుంది, చాలా పొగరు చూపిస్తారు ఇలాంటి వాళ్ళు. అంత పెద్ద హీరో అయినా బాలకృష్ణ ఎప్పుడూ పొగరు చూపించరు. ఈ టైంకి షూటింగ్ అంటే ఆలస్యంగా వచ్చిన దాఖలాలు లేవు అంటూ చెప్పారు. ఇక బాలకృష్ణ కాకుండా వేరే నచ్చిన హీరోలంటే ఉపేంద్ర, శ్రీకాంత్ అంటూ చెప్పారు.

ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాక కొన్ని ఎమ్మెల్యే సీట్లు గెలిచినా పార్టీ నడపడం చేతకాలేదో లేక ఆయనకు తీరిక లేదో తెలియదు కానీ పార్టీని పట్టించుకోలేదు. అందుకే ప్రజారాజ్యం పార్టీ పోయింది. అదే ఆయన పట్టించుకుని ఉంటే ఇప్పుడు పార్టీ బాగా పటిష్టంగా ఉండేది అంటూ అభిప్రాయపడ్డారు. అయితే పవన్ కళ్యాణ్ మొదటి సారి ఎన్నికలలో పోటీ చేసినపుడు అందరూ కొన్ని సీట్లైనా గెలుస్తాడని అనుకున్నాం కానీ ఆయన కూడా గెలవలేదు కానీ పార్టీని నడుపుతున్నారు. పార్టీని నడపడం కార్యకర్తలను మేనేజ్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని, అది పవన్ చాలా బాగా చేస్తున్నారు అంటూ చెప్పారు అంబికా.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago