Categories: FeaturedMovie News

Actor Shivaji raja : 35 సంవత్సరాలుగా చిరంజీవి నామస్మరణ చేశాను… కానీ ఒక్క సినిమా చేయలేదు… ఇప్పుడు పిలిచి చేయమన్నా చేయను…: నటుడు శివాజీ రాజా

Shivaji raja : ‘కళ్ళు’ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమైన శివాజీ రాజా ఆ తరువాత చాలా సినిమాల్లో చిన్న సైజు విలన్ గా నటించాడు. నెగెటివ్ పాత్రలే కాకుండా సహాయక పాత్రలతోను మెప్పించాడు. కమెడియన్ గాను అలరించిన శివాజీ రాజా హీరోగా కొన్ని సినిమాల్లో నటించారు. ఆయన హీరోగా నటించిన ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ సినిమా మంచి గుర్తింపునిచ్చింది. ఆయనకు నంది అవార్డు, అలాగే ఫిలిం ఫేర్ అవార్డులు ఆయన సినిమాలలో నటనకు వచ్చాయి. ప్రస్తుతం మా సినిమా సంఘం లో కీలక పాత్ర పోషిస్తున్న శివాజీ సినిమాల్లో ఎక్కువగా కనిపించడంలేదు.

చిరు అభిమాని అవడం వల్ల కెరీర్ పోయింది…

దర్శకుడు వంశీ మొదటగా హీరోగా నన్ను చూసాడని ‘శ్రీ కనకమహాలక్ష్మి డాన్స్ ట్రూప్’ సినిమాలో మొదట హీరోగా నన్నే అనుకున్న చివర్లో మార్చి నరేష్ ను పెట్టుకున్నారని చెప్పారు. ఇక మొదట హీరోని చేసింది ఎంవి రఘు గారని తెలిపారు. ఇక సీనియర్ నటుడు రంగనాథ్ గారు మొదటి నుండి నన్ను హీరోగా పెట్టి సినిమా తీయాలని భావించేవారిని అలానే మొగుడ్స్ పెళ్లామ్స్ సినిమా తీశామని చెప్పారు. ఇక మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా 35 ఏళ్ల సినీ కెరీర్ లో అవకాశాలు రాలేదని, అభిమానం ఉంటే మనసులో పెట్టుకోవాలి కానీ బయటకు చెప్పకూడదని ఈ తరం వారికి సలహా ఇస్తానని చెప్పారు. చిరు అభిమాని అని చెప్పడం వల్ల వాళ్ళ మనిషి అనుకుంటారని, ఇక మిగతా వాళ్ళు పట్టించుకోరు ఇక మెగాస్టార్ వాళ్ళింట్లో మనోడే కదా అని పట్టించుకోరు, అలా ఎటూ కాకుండా పోయానని ఈ విషయం తెలుసుకోడానికి 35 ఏళ్ళు పట్టిందని చెప్పారు.

మెగాస్టార్ ఫ్యామిలీలో ఏ హీరో సినిమాలోనూ ఇంతవరకు చేయలేదని చెప్పారు. మెగాస్టార్ తో ఇంతవరకు నటించలేదని, ఇకపై ఒకవేళ ఆయనే పిలిచి అడిగినా నటించనని ఆ ఓపిక, కసి ఇప్పుడు లేవని తెలిపారు. కానీ చాలా సినిమాలు ఇతర హీరోలతో చేసానని గుర్తుచేసుకున్నారు. ఇక బుల్లి తెర మీద అమృతం, ఆలస్యం అమృతం విషం, పండు మిరపకాయ్, నాన్న కుచ్చి వంటి సీరియల్స్ తో అలరించారు శివాజీరాజా. ఇక ఈ మధ్య ‘అర్జున ఫాల్గుణ’ సినిమాలో కూడా నటించారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago