Featured

Nagarjuna: కోట్ల రూపాయలు ఇస్తూ పెళ్లిళ్లకు రమ్మని పిలుస్తున్నారు.. నాగార్జున కామెంట్స్ వైరల్!

Published

on

Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నాగార్జున ఒకరు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి నాగార్జున ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పటికి నాగర్జున వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా నాగార్జునకు సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ ప్రస్తుతం ఒక బిజినెస్మెన్ ఇంట్లో కనుక పెళ్లి జరిగితే పెద్ద ఎత్తున సెలెబ్రిటీలను ఆహ్వానిస్తూ ఉంటారు అయితే సెలబ్రిటీలకు కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చి వారిని పెళ్లికి ఆహ్వానిస్తున్నారని తెలిపారు.

కేవలం 20 నిమిషాలు పెళ్లిలో కనిపించి ఒక ఐదు నిమిషాల పాటు పెర్ఫార్మెన్స్ చేస్తే చాలు వారికి కోట్లలో డబ్బులు చెల్లిస్తున్నారంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో తనకి కూడా ఇలాంటి ఆహ్వానాలు అందాయని కానీ తాను మాత్రం వెళ్లలేదని నాగార్జున తెలిపారు.

Advertisement

డబ్బు తీసుకొని వస్తున్నారు…
ఇక ఇటీవల ముఖేష్ అంబానీ కుమారుడు పెళ్లి వేడుకలలో పెద్ద ఎత్తున బాలీవుడ్ సెలబ్రిటీలు మూడు రోజుల పాటు సందడి చేసిన సంగతి తెలిసిందే దీంతో వీరందరూ కూడా రెమ్యూనరేషన్ తీసుకొని అక్కడికి వచ్చారని వాదన వినిపిస్తున్నటువంటి తరుణంలో నాగార్జున చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించిన ఓల్డ్ వీడియోని కూడా వైరల్ చేస్తున్నారు.

Advertisement

Trending

Exit mobile version