Nagarjuna: సినిమాలకు నాగార్జున గుడ్ బై చెప్పారా.. ఇక వాటికే పరిమితమవుతారా?

Nagarjuna: అక్కినేని నాగార్జున గత ఏడాది ఘోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత ఈయన ఎలాంటి సినిమాలను ప్రకటించలేదు.ఈ విధంగా నాగార్జున ఎలాంటి సినిమాలను ప్రకటించకపోవడంతో చాలామంది నాగార్జున సినిమాలకు దూరమవుతున్నారా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈయన సినిమాలకు దూరమవుతున్నారని తెలుస్తుంది.

ఈ విధంగా నాగర్జున ఎలాంటి సినిమాలను ప్రకటించకపోవడంతో ఈయన సినిమాలకు దూరం అవుతూ డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టబోతున్నారని సమాచారం.ఇప్పటికే ఎంతోమంది హీరోలు డిజిటల్ ఎంట్రీ ఇచ్చి పెద్ద ఎత్తున వెబ్ సిరీస్లలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నాగార్జున సైతం నెట్ ఫ్లిక్స్ కోసం ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ వారు నాగార్జునను సంప్రదించి ఆయనతో చర్చలు జరపగా అందుకు నాగార్జున కూడా ఒప్పుకున్నారని సమాచారం. అయితే ఈ సిరీస్ 10 భాగాలుగా రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ లో నాగార్జున రైటర్స్ కూడా భాగస్వాములుగా మారారట.ఈ సిరీస్ ఖచ్చితంగా నాగార్జునకు సరిపోతుందన్న ఉద్దేశంతోనే ఈయన డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

Nagarjuna: వెబ్ సిరీస్ కోసం సినిమాలు మానేయడం అవసరమా…


ఇలా సినిమాలు చేయకుండా డిజిటల్ మీడియాలోకి నాగార్జున ఎంట్రీ ఇవ్వడంతో ఆయన అభిమానులు కొంత పాటి అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే ఎంతో మంది హీరోలు సినిమాలలో నటిస్తూనే డిజిటల్ మీడియా వైపు అడుగులు వేస్తున్నారు. నాగార్జున కూడా అలాగే చేయొచ్చు కదా వీటికోసం సినిమాలు మానేయడం దేనికి అంటూ కామెంట్ చేస్తున్నారు.