Movie News

Ramcharan: మా పాప పై మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి… మొదటిసారి మీడియాతో మాట్లాడిన చరణ్!

Ramcharan: రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఈనెల 20 వ తేదీ ఆడబిడ్డ జన్మించిన సంగతి మనకు తెలిసింది. అపోలో హాస్పిటల్లో పాపకు జన్మనిచ్చిన ఉపాసన నేడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిసి వైద్యులు డిశ్చార్జ్ చేసారు. అయితే ఉపాసన డిస్చార్జ్ అవుతున్న తరాణంలో రామ్ చరణ్ మొదటి సారి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాంచరణ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.జూన్ 20వ తేదీ ఉపాసన బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని తెలిసి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారని తెలిపారు. ఇక తన బేబీ కోసం ఎంతో కేర్ తీసుకున్నటువంటి అపోలో హాస్పిటల్ వైద్యులకు ఈయన ధన్యవాదాలు తెలిపారు.

ఇక ఎన్నో సంవత్సరాలుగా తాము ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నామని అయితే దేవుడు బ్లెస్సింగ్స్ వల్ల తమకు పాప పుట్టిందని తెలిపారు. పాప కోసం ప్రార్థించిన ప్రతి ఒక్క అభిమానులకు ధన్యవాదాలు అని తెలియజేశారు. నా కూతురిపై మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని, ఈ సంతోషకరమైన సమయంలో తాను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నానని రామ్ చరణ్ తెలిపారు. ఇక రామ్ చరణ్ ను మీడియా ప్రశ్నిస్తూ పలు ప్రశ్నలు వేశారు.

Ramcharan: పాప నా పోలికలతోనే ఉంది.


పాపకు ఏ పేరు పెట్టాలనుకుంటున్నారని చెప్పడంతో తాను ఉపాసన ఇద్దరు కూడా పేరు ఫిక్స్ అయ్యామని 21వ రోజు ఆ పేరును రివిల్ చేస్తామని తెలిపారు.ఇక పాపను ఎత్తుకోగానే మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందని అడగగా అందరి నాన్నలకు కలిగిన ఫీలింగ్ తనకు కలిగిందని తెలిపారు. పాప ఎవరి పోలికలతో ఉంది అంటూ ప్రశ్నించడంతో పాప నా పోలికలతోనే ఉన్నారు అంటూ చరణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago