Sudhkar: సుధాకర్ పరిచయం అవసరం లేని నటులు ఒకప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈయన కొన్ని కారణాల వల్ల తమిళ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది అయితే ఇక్కడ హీరోగా కాకుండా ఈయనకు కమెడియన్ గా అవకాశాలు వచ్చాయి. ఈ విధంగా కమెడియన్ గా ఇండస్ట్రీలో గత నాలుగు దశాబ్దాలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుధాకర్ కు ప్రస్తుతం అనారోగ్య సమస్యలు కారణంగా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. అయితే ఈయన ఇండస్ట్రీకి దూరంగా ఉండడంతో ఇతను చనిపోయారని చాలామంది వార్తలు సృష్టించారు. అయితే తాను బ్రతికే ఉన్నానని క్షేమంగా ఉన్నానని సుధాకర్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఇకపోతే తాజాగా ఒక బుల్లితెర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈయన అనంతరం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సుధాకర్ తన కుమారుడు బెనడిక్ మైఖేల్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.తనకు తన కుమారుడు దేవుడిచ్చిన బిడ్డ అని తెలిపారు. పెళ్లి తర్వాత తాము పిల్లల కోసం ఎన్నో సంవత్సరాల పాటు ఎదురు చూసాము అయినప్పటికీ పిల్లలు కలగలేదు.
ఒకసారి చర్చికి వెళ్లి జీసస్ నుప్రార్థించడంతో తమకు తమ కుమారుడు జన్మించాడని అందుకే తాము క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యామని తెలిపారు. తన కుమారుడు జన్మించిన తర్వాత తమకు అన్ని విధాలుగా కలిసి వచ్చింది.తాను నాకు దేవుడిచ్చిన బిడ్డ అందుకే తనకు బెనిడిక్ మైకేల్ అనే పేరు పెట్టామని ఈ సందర్భంగా తన కొడుకు గురించి తెలియజేశారు.ఇక తన కుమారుడు చదువులు పూర్తిచేసుకుని తిరిగి వచ్చారని త్వరలోనే ఆయన ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…