Toliprema: తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా పలువురు స్టార్ హీరోలు నటించి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలను అందుకున్నటువంటి సినిమాలను తిరిగి ప్రేక్షకుల కోసం ఫోర్ కే వెర్షన్ లో విడుదల చేస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది హీరోలు నటించిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఖుషి,జల్సా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సరికొత్త రికార్డులను సృష్టించాయి. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ రీ రిలీజ్ సినిమా ఖుషికి వచ్చినటువంటి కలెక్షన్స్ ఏ ఇతర రీ రిలీజ్ సినిమాలు కూడా రాబట్ట లేకపోయాయి. దీంతో ఈ సినిమా కలెక్షన్లను తిరిగి పవన్ కళ్యాణ్ సినిమాని బ్రేక్ చేస్తుందని పలువురు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటించినటువంటి క్లాసిక్ లవ్ స్టోరీ తొలిప్రేమ సినిమాని తిరిగి విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్రింటును శ్రీమాతా క్రియేషన్స్ వారు కొనుగోలు చేసే దీనిని ఫోర్ కే వెర్షన్లో తయారు చేశారు. ఈ క్రమంలోనే శ్రీ మాత క్రియేషన్స్ వారు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా ఈ నెల 31వ తేదీ విడుదల కాబోతుందని ప్రకటించారు.
ఇలా ఈ సినిమా తిరిగి విడుదలైన తర్వాత ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్ అన్నిటిని కూడా జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వబోతున్నామని శ్రీమాతా క్రియేషన్స్ వారు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈనెల 30వ తేదీ విడుదల కాబోతున్నటువంటి ఈ సినిమాని ప్రమోట్ చేయడం కోసం త్వరలోనే హైదరాబాద్లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నట్లు శ్రీమాతా క్రియేషన్స్ అధికారికంగా తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…