Niharika: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం తన వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈమె తిరిగి సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా మారిపోయారు ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతూ ఉన్నటువంటి నిహారిక తాజగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె రామ్ చరణ్ గురించి అలాగే తన భార్య ఉపాసన గురించి పలు విషయాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ రామ్ చరణ్ అన్నయ్య తండ్రి కాబోతున్నారన్న విషయం గత ఏడాది తెలిసినప్పుడు మా కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషం వ్యక్తం చేశామని తెలిపారు. ఇక పాప రాకతో వారి ఫ్యామిలీ పరిపూర్ణమైందని నిహారిక వెల్లడించారు. ఇక చరణ్ అన్నయ్య మా మెగా ఫ్యామిలీ కజిన్స్ అందరి పట్ల చాలా ప్రేమ కలిగి ఉంటారు.
ఇలా అందరి పట్ల ప్రేమగా ఎంతో బాధ్యతగా ఉండడంతో మేమందరం చరణ్ అన్నయ్యను బాపూజీ అని పిలుస్తామని నిహారిక ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఉపాసన వదిన గురించి చెప్పాల్సిన పనిలేదు ఆమె ఒక శక్తివంతమైన మహిళ. వీరిద్దరి సంరక్షణలో పాప పెరుగుతుంది అంటే తను కూడా ఓ గొప్ప స్థాయికి వెళ్తుందని నిహారిక వెల్లడించారు.
ఈ సందర్భంగా నిహారిక తన అన్నయ్య రామ్ చరణ్ వదిన ఉపాసన గురించి పలు విషయాలను తెలియచేయడమే కాకుండా తనకు పుట్టిన కూతురు కూడా ఓ గొప్ప స్థాయికి వెళ్తుంది అంటూ ఈ సందర్భంగా తను చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక నిహారిక వ్యక్తిగత జీవితంలో కాస్త డిస్టర్బెన్స్ వచ్చిందని అందుకే తన భర్తకు విడాకులు ఇచ్చారంటూ కూడా వార్తలు వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…