Nandamuri Janaki Ram: ఎన్టీఆర్ అన్నయ్య జానకిరామ్ భార్య రెండో పెళ్లి చేసుకున్నారా… వైరల్ అవుతున్న న్యూస్!

Nandamuri Janaki Ram: సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నందమూరి వారసులుగా పలువురు ఇండస్ట్రీలోకి వచ్చి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమైన విషయం మనకు తెలిసిందే. అయితే నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హరికృష్ణ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించలేదు.

ఇలా హరికృష్ణ నటుడిగా ఫెయిల్యూర్ కాకుండా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక ఈయన వారసులుగా మనకు కేవలం కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ మాత్రమే తెలుసు కానీ ఈయనకు మరొక కుమారుడు జానకిరామ్ కూడా ఉన్నారు. ఇక ఈయనకు దీపిక అనే భార్య ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు జానకిరామ్ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు.

ఇలా రోడ్డు ప్రమాదంలో జానకిరామ్ మరణించడంతో దీపిక తన ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకుంటూ జీవితం గడుపుతున్నారు. అయితే తాజాగా దీపిక గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీపిక ఒంటరి జీవితాన్ని గడుపుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు సన్నిహితుల సలహా సూచన మేరకు ఈమె రెండో పెళ్లి చేసుకుందనే వార్తలు వినపడుతున్నాయి.

Nandamuri Janaki Ram: కొత్త జీవితాన్ని ప్రారంభించిన దీపిక…

కుటుంబ సభ్యులు తనని బలవంతం చేయడంతోనే ఈమె కూడా రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.మరి దీపిక రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.