Star Couple: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల మధ్య ఎప్పుడు ప్రేమ పుడుతుందో ఎప్పుడు వారి ప్రేమకు బ్రేకప్ చెప్పుకుంటారో తెలియదు. అయితే ప్రేమించుకొని పెళ్లి చేసుకుని మంచి జీవితాన్ని గడిపేవారు తక్కువమందే ఉన్నారని చెప్పాలి. చాలామంది ప్రేమలో ఉండగానే తమ రిలేషన్ కు బ్రేకప్ చెప్పుకోగా, మరికొందరు నిశ్చితార్థం జరిగిన తర్వాత బ్రేకప్ చెప్పుకొని విడిపోతున్న వారు ఉన్నారు. ఇప్పటికే ఎన్నో జంటలు ఇలా విడిపోగా తాజాగా ఈ జాబితాలోకి మరో జంట వచ్చింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు విద్యుత్ జమ్వాల్.. మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. జూనియర్ ఎన్టీఆర్ ‘శక్తి’ సినిమాతో నటుడిగా మారాడు.. తర్వాత ‘ఊసరవెల్లి’లోనూ విలన్‌గా కనిపించి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా తెలుగు తమిళ భాషలలో విలన్ గా నటించిన ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి విద్యుత్ ఫ్యాషన్ డిజైనర్ నందితా మహ్తానీతో మూడేళ్ల క్రితం ప్రేమలో పడ్డారు. ఇక దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తూ ఈ జంట ప్రేమ పక్షులలా విహరిస్తూ వచ్చారు. అయితే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ నిశ్చితార్థం జరుపుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తుంది.
తాజాగా అనన్య పాండే పెళ్లికి అటెండ్ అయిన విద్యుత్, నందిత ఎడమొహంపెడ మొహం పెట్టుకొని కనిపించారు. దీంతో వీరిద్దరూ రిలేషన్ కు బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఇదివరకే నందితాకు పెళ్లి జరిగి విడాకులు కూడా తీసుకున్నారు. ఇలా ఇదివరకే పెళ్లి చేసుకున్నటువంటి ఈమె రణ్‌బీర్ కపూర్, డినో మోరియా లాంటి బాలీవుడ్ హీరోలతో కూడా రిలేషన్ లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఈమె విద్యుత్ తో ప్రేమలో పడి నిశ్చితార్థం జరుపుకొని బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తుంది.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…