Movie News

Hero Nani: అందరి ముందు ఆ డైరెక్టర్ దారుణంగా అవమానించారు… చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న నాని!

Hero Nani: సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికి ఏ విధమైనటువంటి అవమానాలు, ఇబ్బందులు లేకుండా అవకాశాలు వస్తాయి.ఇలా అవకాశాలు వచ్చిన తర్వాత వారి టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో కొనసాగడం లేదా ఇండస్ట్రీకి దూరం అవడం అనేది జరుగుతుంది. కానీ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఉన్న వారికి అవకాశాలు రావడమే గగనం.

ఇలా అవకాశాల కోసం తిరుగుతూ ఎంతో మంది చేత అవమానాలను, తిరస్కరణలను ఎదుర్కొంటూ ఉంటారు.ఇలా ఎంతోమంది ఇలాంటి అవమానాలను ఎదుర్కొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఈయన కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణం మొదలుపెట్టారు.

ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా మారిన నాని తర్వాత డైరెక్టర్ గాను అలాగే హీరోగా స్థిరపడి మంచి గుర్తింపు పొందారు.ఇక ప్రస్తుతం ఈయన దసరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా మార్చి 30 తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాని తన కెరియర్ మొదట్లో ఎదుర్కొన్నటువంటి అవమానాలను చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కెరియర్ మొదట్లో తాను కూడా ఎన్నో కష్టాలను అవమానాలను పడ్డానని తెలిపారు.


Hero Nani: డైరెక్టర్ కాలేనని అవమానించారు…

ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఇక్కడ ఏం జరుగుతుందో తనకు తెలిసేది కాదని, ఎవరు తనకు చెప్పి సహాయం చేసేవారు కాదని తెలిపారు. అందరిలాగే తాను కూడా కష్టాలను పడ్డానని తెలిపారు. ఇక ఒక డైరెక్టర్ అందరి ముందు సెట్ లో నన్ను దారుణంగా అవమానించారని గుర్తు చేసుకున్నారు. నువ్వు ఈ జన్మకు డైరెక్టర్ కాలేవు అంటూ ఆయన తనని అవమానించారని, అయితే ఆ క్షణం బాధపడిన నాలో మరింత కసి పెంచుకొని నేను ఈ స్థాయికి వచ్చానని తెలిపారు.నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆ డైరెక్టర్ అవమానాలే కారణమని నాని తెలిపారు. మరి నానిను అవమానించిన ఆ డైరెక్టర్ పేరు మాత్రం చెప్పలేదు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago