అబితాబ్ కు నాటో లేఖ.. అందులో ఏముందో తెలుసా..

భారతదేశంలో ప్రస్తతం సినీ దిగ్గజం అని అబితాబ్ బచ్చన్ ను పిలుస్తాం. అయితే అతడికి నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్ సంచలన లేఖను రాసింది. అదేంటో తెలుసా.. పాన్ మాసాలాను ప్రచారం చేసే వాణిజ్య ప్రకటన నుంచి వైదొలగాలని లేఖలో పేర్కొంది. ఎందుకంటే.. పాన్ మసాలాలో ఊపిరితిత్తులకు హానికరమైన పొగాకు ఉంటుందని.. ఇది ప్రజలకు అలవాటు అయితే.. దానికే వ్యసనంగా మారుతారని.. దీని వల్ల వాళ్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిపింది.

ప్రజలకు ఉపయోగపడే ప్రకటనలు చేయాలని.. ప్రజల ఆరోగ్యం చెడిపోయే ప్రకటలను చేయవద్దని సూచించింది. దీనికి సంబంధించి నేషనల్ యాంటీ టొబాకో ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శేఖర్ సల్కర్ లేఖ రాశారు. ఎన్నో మంచి కార్యక్రమాలకు ప్రకటనలు ఇస్తున్న అమితాబ్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటూ విన్నవించింది.

అమితాబ్ హై ప్రొఫైల్ పల్స్ పోలియో ప్రచారానికి ప్రభుత్వం తరపున బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిదే. అలాంటి వ్యక్తి ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేసే పాన్ మసాలా యాడ్ లో నటించడం సరికాదని కూడా లేఖలో శేఖర్ సల్కర్ అన్నారు. సెలబ్రిటీలు ఏం చేసినా చాలామంది వాటిని నమ్ముతారని.. ఇటువంటి వాటిని ప్రోత్సహించడం సరికాదని లేఖలో పేర్కొన్నాడు.

పాన్, గుట్కా వంటివి క్యాన్సర్ కు కారకాలుగా ఉంటాయి.. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. పాన్ మసాల క్యాన్సర్ కారకంగా పని చేస్తోందనే విషయం పరిశోధనల్లో తేలిందని… అందులోని పదార్ధాలు నోటి క్యాన్సర్ కు దారి తీస్తాయని పేర్కొన్నారు. అయితే లేఖ రాసిన అతడికి అబితాబ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.