పురాతన వస్తువులు, పురాతన కాలానికి సంబంధించి నాణేలు కలెక్ట్ చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. అప్పట్లో ఇవి ఇలా ఉండేవి.. అంటూ తన స్నేహితులకు చూపించుకుంటూ మురిసిపోతుంటారు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే.. యూర్బెక్స్ మ్యూస్ అనే వ్యక్తి 25 ఏళ్లుగా తలుపులు మూసి ఉన్న తన అమమ్మ ఇంటికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాడు. అనుకున్నట్లుగానే అతడు ఓ రోజు తన అమమ్మ ఇంటికి బయలు దేరాడు.
అక్కడ వాళ్ల అమమ్మ చనిపోయి కొన్ని సంవత్సరాలు అయింది.. ఆమెకు సంబంధించి జ్ఞాపకాలు అలానే ఉండాలని 25 ఏళ్ల క్రితం ఆ ఇంటికి తలుపులు వేశారు. ఇలా ఆమె గుర్తుగా దాని తలుపులు తీయలేదు. అతడు ఆ రోజు ఆ భవనం తలుపులు తెరిచి చూడగా ఒక్కసారిగా షాక్ తిన్నాడు.
అక్కడ కనిపించిన వస్తువులు ప్రతీ ఒక్కటి అతడిని ఆశ్చర్యపరిచాయి. ఒక్కో అడుగు ఇంట్లోకి వేసుకుంటూ వెళ్తుండగా.. అక్కడ అన్నీ తన అమమ్మకు సంబంధించి వస్తువులు కనిపించాయి. దీంతో అతడి మదిలో ఎన్నో జ్ఞాపకాలు వాళ్ల అమమ్మతో ఉన్న మధుర తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నాడు. అలా ఇంట్లో ఉన్న మెట్ల దగ్గరకు వెళ్లగా అక్కడ ఏదో రహస్య గదిని గుర్తించాడు.
అందులోకి ఎంటర్ అయ్యాడు. గోడలకు ఇరువైపులా ఎన్నో చిత్రాలు తన అమ్మమ్మ జ్ఞాపకాలను అతడికి గుర్తు చేశాయి. అక్కడే ఓ ట్రంక్ పెట్టెను చూశాడు. అది తెరవగానే వాళ్ల అమమ్మకు సంబంధించి చిన్ననాటి ఫొటోలు ఉన్నాయి. ఇవన్నీ అతడు వీడియోలు, ఫొటోలు తీసి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. గత కొన్ని రోజుల నుంచి ఆ ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో అతడు అక్కడ తనకు ఎదురైన అనుభూతులను నెటిజన్లతో పంచుకున్నాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…