Naveen Reddy: ఫోర్జరీ కేసులో నేరాన్ని అంగీకరించిన నటుడు నవీన్ రెడ్డి… విచారణలో బయటపడిన నిజాలు!

Naveen Reddy: ఎన్‌ స్క్వైర్‌ కంపెనీ డైరెక్టర్లు ఫిర్యాదు మేరకు సినీ నటుడు నవీన్ రెడ్డి అట్లూరినీ రెండు రోజుల క్రితం హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం మనకు తెలిసిందే. నవీన్ రెడ్డి ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్ స్క్వేర్ కంపెనీలో డైరెక్టర్ గా వ్యవహరించేవారు. అయితే ఈయన ఇతర డైరెక్టర్లకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలు చేసి భారీగా డబ్బులను నొక్కేసారని ఇతర డైరెక్టర్లు నవీన్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నవీన్ రెడ్డి ఫోర్జరీ సంతకాలతో దాదాపు 55 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని ఇతర డైరెక్టర్లు ఈయనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హైదరాబాద్ పోలీసులు తనని అరెస్టు చేసి గత రెండు రోజులుగా విచారణ చేస్తున్నారు. అయితే ఈ విచారణలో భాగంగా నటుడు నవీన్ రెడ్డి నిజాలు అన్నింటిని బయటపెట్టినట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే నవీన్ రెడ్డి డైరెక్టర్ గా బాధ్యతలు వ్యవహరిస్తూ ఇతరులకు తెలియకుండా ఫోర్జరీ సంతకాల ద్వారా 38 కోట్ల రూపాయల డబ్బును నొక్కేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఎన్ స్క్వేర్ కంపెనీకి చెందిన ఆస్తులను కూడా తన పేరు పైకి మార్చుకున్నట్టు తెలుస్తోంది.ఇక ఈ విషయాలన్నీ స్వయంగా నవీన్ రెడ్డికి పోలీసులు ముందు ఒప్పుకున్నారు.

Naveen Reddy: నోబడీ సినిమాలో హీరోగా నవీన్ రెడ్డి..

ఈ కంపెనీ నుంచి భారీగా డబ్బులను స్కామ్ చేసి సొంతంగా తానే హీరోగా హీరోగా నోబడీ అనే సినిమాను చేశారు. అలాగే భారీగా జల్సాలు చేయడంతో అనుమానం వచ్చిన ఇతర డైరెక్టర్స్‌కు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిసిఎస్ పోలీసులు నవీన్ రెడ్డిపై 420, 465,468,471 r/w 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇలా కేసు నమోదు చేసిన అనంతరం విచారణ చేపట్టడంతో నవీన్ రెడ్డి తాను చేసిన నేరాలను అంగీకరించారు.