Nilesh Parents : టిఎస్పిఎస్ పేపర్ లీకేజీలో మా కొడుకు చెప్పింది అదే… రేణుక ఎంత డబ్బు తీసుకుందంటే…: నీలేష్ పేరెంట్స్

Nilesh parents : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయి. కమిషన్ ఆఫీస్ నుండే పరీక్ష పేపర్ లీక్ అవ్వడం కలకలం రేపింది. దీని వెనుక కమిషనర్ పిఏ ప్రవీణ్, అతనితో పాటు మరో మహిళ రేణుక ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో 15 మందిని తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు వారిని రిమాండ్ కు తరలించగా ప్రవీణ్ ఫోన్ లో దాదాపు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మహిళా అభ్యర్థుల న్యూడ్ ఫోటోలు వీడియో కాల్స్ రికార్డింగ్ అన్నీ ఉన్నాయి. దాదాపు 46 మంది మహిళల న్యూడ్ వీడియోలు ఫొటోలు ప్రవీణ్ ఫోన్ లో దొరకగా పేపర్ లీక్ చేయించుకున్న అభ్యర్థులలో మమహబూబ్ నగర్ జిల్లా మన్సుర్ తండాకు చెందిన నీలేష్, రాజేందర్ అనే అభ్యర్థుల తల్లి దండ్రులు మీడియాతో మాట్లాడుతూ అసలు ఈ విషయాలేవి తెలియదని చెబుతున్నారు.

పది లక్షలు ఇచ్చేంత స్థోమత లేదు…

నీలేష్ పూణేలోనే జాబ్ చేస్తూ ఉండేవాడని ఊరి లో తమకు కొంత భూమి ఉండగా ఇతర వ్యవసాయ పనులకు కూలి వెళ్తున్నట్లు నీలేష్, రాజేందర్ ల తల్లి చెబుతున్నారు. ఇక కేసులో కీలకంగా ఉన్న రేణుక పక్కన ఉన్న తండాకు చెందిన మహిళ అయినా తమకు తెలియదని వివరిస్తున్నారు. ఎవరో ఇరికించారని తమ పిల్లలకు ఇలాంటి బుద్ధి లేదని పది లక్షలు రేణుకకి ఇచ్చేంత స్థోమత లేదంటూ వివరించారు. అసలు ఎవరు మోసం చేసారో తెలియదంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు.

ప్రభుత్వం టీచర్ అయిన రేణుక ప్రవీణ్ ద్వారా టిఎస్పిఎస్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ కమిషనర్ తో పరిచయం పెంచుకుని లాగిన్ ఐడి పాస్ వర్డ్ సంపాదించి ప్రవీణ్ ద్వారా పేపర్ లీకేజీ చేయించుకుంది. తన కమ్యూనిటీ వాళ్ళైన నీలేష్, రాజేందర్ లకు పేపర్ తనకు తెలుసనీ సమాచారం అందించి మరికొంత మంది వద్ద పది నుండి ఇరవై లక్షల దాకా వసూలు చేసి పేపర్ లీక్ చేసింది. నీలేష్, రాజేంధర్ లను తన ఇంట్లోనే పెట్టుకుని ఎక్సామ్ కి ముందు ప్రిపేర్ చేయించి తానే స్వయంగా పరీక్షా కేంద్రం వద్ద దిగబెట్టినట్లు సమాచారం.