NTR: ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటేనే మంచిది.. రాజకీయాలలోకి వచ్చి తప్పు చేయొద్దంటున్న ఫ్యాన్స్?

NTR: నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఏకంగా పాన్ ఇండియా స్థాయి సినిమాలలో కూడా చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇకపోతే గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయాలలోకి రావాలని ఈయన తెలుగుదేశం పార్టీలోకి అడుగుపెడితేనే పార్టీకి తిరిగి పూర్వ వైభవం వస్తుందని అభిమానులు భావించి పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ను రాజకీయాలలోకి రావాలని కోరారు.

ఇలా ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలని అభిమానులు ఎంత కోరుకున్న ఈయన మాత్రం రాజకీయాల గురించి ఏ మాత్రం నోరు విప్పలేదు.అయితే ఎవరు ఊహించని విధంగా కేంద్ర మంత్రి అమిత్ షా ఏకంగా ఎన్టీఆర్ కి అపాయింట్మెంట్ ఇచ్చి ఎన్టీఆర్ తో భేటీ కావడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ పెద్ద ఎత్తున రాజకీయ చర్చలకు దారి తీసింది. ఈ విధంగా ఎన్టీఆర్ అమిత్ షా భేటీ వెనుక ఉన్న కారణం ఏంటి అని ఆరా తీస్తున్నారు.

ఒకవేళ అమిత్ షా ఎన్టీఆర్ ను బీజేపీ పార్టీలోకి ఆహ్వానించబోతున్నారా అనే విషయం తెలియడంతో అభిమానులు ఈ విషయంపై స్పందించి పొరపాటున కూడా అలాంటి తప్పు చేయవద్దని అభిమానులు తమ అభిమాన నటుడు ఎన్టీఆర్ కి సూచనలు చేస్తున్నారు. ఎన్టీఆర్ కనుక బీజేపీ పార్టీలోకి వెళితే ఈయన వ్యక్తిగతంగా ఇతర పార్టీ నాయకులకు టార్గెట్ అవుతారు. తద్వారా ఈయనకు శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే పొరపాటున కూడా రాజకీయాలలోకి వద్దంటూ అభిమానులు సూచిస్తున్నారు.

NTR: రాజకీయాలలోకి మాత్రం వద్దు..

ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.ఈయన డిమాండ్ చేస్తే ఒక్కో సినిమాకి 100 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చే నిర్మాతలు ఉన్నారని ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైతే బాగుంటుందని రాజకీయాలలోకి వెళ్తే మాత్రం ఈయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ అభిమానులు ఈయన రాజకీయ ఎంట్రీ గురించి మాట్లాడుతూ రాజకీయాలలోకి మాత్రం వద్దని సూచనలు చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ అమిత్ షా భేటీ వెనుక ఉన్న కారణం ఏంటో తెలియాల్సి ఉంది.