Chethan Cheenu : మంత్ర 2, రాజుగారి గది వంటి హార్రర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు చేతన్. తెలుగులో కంటే ముందే తమిళంలో పలు సినిమాల్లో నటించినా హీరోగా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ నచ్చిన పాత్రలను చేస్తూ వచ్చాడు. ‘పెళ్లికి ముందు ప్రేమ కథ’ సినిమాలో తెలుగులో హీరోగా చేసినా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. చేతన్ సత్యం డైరెక్టర్ సూర్యకిరణ్, కళ్యాణిలకు బంధువు సూర్యకిరణ్ వాళ్ళ ఇంట్లోనే పెరిగాడు. ఇక సినిమా అవకాశాల విషయంలో వారి హెల్ప్ ఎపుడూ తీసుకోలేదని చెప్తూ ఎలాంటి పాత్రలు ఎంపిక చేసుకోవాలో మాత్రం సలహాలు తీసుకునేవాడిని అంటూ తన నేపథ్యం చెబుతూ సూర్యకిరణ్, కళ్యాణి లు ఎందుకు విడిపోయారో చెప్పాడు.
వాళ్ళు విడిపోడానికి కారణం…
సూర్యకిరణ్ ను అన్న అంటూ పిలిచే చేతన్ కి కళ్యాణి కూడా బాగా దగ్గరి మనిషి. అక్కా అంటూ కళ్యాణిని సంబోధించేవాడు. ఇక సినిమాల విషయంలో ఇద్దరూ ఎంతో సహాయం చేసారని, పెద్ద డైరెక్యోర్లను కలిసినప్పుడు కళ్యాణి ఖచ్చితంగా నా తమ్ముడు చేతన్ ఉన్నాడు ఒకసారి చూడండి అంటూ రెఫెర్ చేసేదట. ఇక సూర్యకిరణ్ కూడా ప్రొడ్యూసర్లను కలిసినపుడు చేతన్ ను పరిచయం చేయడం వంటివి చేసే వాడట. అలాంటి వాళ్లిద్దరూ విడిపోడం చాలా బాధగా అనిపించింది అంటూ చేతన్ చెప్పారు.
ఇక వాళ్లిదరూ ఏదైనా నిర్ణయం తీసుకునేప్పుడు బాగా ఆలోచిస్తారు. వారి మధ్య వ్యక్తిగతంగా ఏమి జరిగిందో బయట మూడో వ్యక్తికి తెలియదు కదా అలాంటప్పుడు ఎలా సలహా ఇస్తాము. ‘చాప్టర్ 6’ సినిమా సమయంలో సూర్య కిరణ్ అన్న చాలా కష్టపడ్డాడు. కానీ సినిమా సక్సెస్ అవకపోవడం వల్ల ఆర్థికంగా నష్టపోయారు. దీంతో అభిప్రాయాబేధాలు మొదలయ్యాయి వాళ్ల రిలేషన్ లో కూడా ఆ సినిమా సమయంలో నేను ఉన్నాను వారితో. సినిమా చాలా బాగుంటుంది కానీ అది ఆ సమయంలో రావాల్సిన సినిమా కాదేమో, ఇప్పుడు వచుండుంటే ఓటీటీ లో అయినా మంచి హిట్ అయ్యుండేది అంటూ కారణాలు వివరించాడు చేతన్ చీను.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…