Actor Krishna Bhagwan: మల్లెమాల వారి నిర్మాణంలో బుల్లితెరపై గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మల్లెమాల వారు నిర్వహిస్తున్నటువంటి వాటిలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి.ఈ కార్యక్రమంలో భాగంగా గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఎంతో విజయవంతంగా ముందుకు దూసుకుపోతున్న ఈ కార్యక్రమంలో గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి.
ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి నాగబాబు రోజా ఈ కార్యక్రమానికి రెండు కళ్ళల ఉండి ముందుకు నడిపించారు.ఇకపోతే కొన్ని కారణాల వల్ల నాగబాబు ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో రోజా కీలకంగా మారి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించింది. ఇక నాగబాబు స్థానంలో తరచు కొందరు జడ్జిలు వస్తూ వెళ్తూ ఉన్నారు.
ఇక రోజాకి కూడా మంత్రి పదవి రావడం చేత ఆమె ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక రోజా ఈ కార్యక్రమం నుంచి వెళ్లిపోవడంతో రోజా స్థానాన్ని ఇంద్రజ ఆక్రమించారు.ఇక ఇంద్రజ ఈ కార్యక్రమానికి పర్మినెంట్ జడ్జిగా ఉన్నప్పటికీ నాగబాబు స్థానంలో ఇప్పటివరకు పర్మనెంట్ జడ్జి రాలేదు.ఇకపోతే తాజాగా ఈ వారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా నాగబాబు స్థానంలో పర్మనెంట్ జడ్జిగా నటుడు సీనియర్ కమెడియన్ కృష్ణ భగవాన్ ను ఈ కార్యక్రమానికి పర్మనెంట్ జడ్జిగా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.తాజాగా విడుదలైన ప్రోమోలో ఈయన ఎంట్రీ ఎంతో గ్రాండ్ గా ఇవ్వడమే కాకుండా ప్రోమో లోనే తన కామెడీ పంచ్ డైలాగులతో అదరగొట్టారు. ఇలా కమెడియన్లపై సెటైర్లు వేస్తూ పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇది చూసిన ఎంతోమంది అభిమానులు మొత్తానికి ఎంతో మంచి జడ్జ్ నీ తీసుకువచ్చారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…