Featured

Amala Paul : ఆ హీరోలతో నటించేటపుడు బాగా ఇబ్బంది పడ్డాను.. విసుగొచ్చి సినిమాలు మానేద్దామని అనుకున్నా : అమల పాల్

Amala Paul : మళయాళం లో మొదలు పెట్టి తమిళం, తెలుగు, కన్నడ వంటి అన్ని భాషలలోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న అమలా పాల్ ప్రస్తుతం తెలుగులో కనిపించడం లేదు కానీ తమిళం, మలయాళం లో సినిమాలు, వెబ్ సిరీస్ లంటూ బిజీగా ఉంది. కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు డైరెక్టర్ ను పెళ్లి చేసుకుని ఆ తరువాత విడాకులు తీసుకుని ఇపుడు మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్న అమలా పాల్ ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. అయితే తన కెరీర్ లో జరిగిన సంఘటనల గురించి స్పందించింది అమల పాల్.

సీనియర్స్ తో నటించేప్పుడు ఇబ్బంది పడ్డాను…

‘మైనా’ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైన అమల పాల్ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు కొన్ని ప్రయోగాలు బాగుంటాయి కానీ మరీ సినిమా కెరీర్ ప్రారంభంలోనే నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేసి మెప్పించింది. ఇక తెలుగులో బన్నీ, రామ్ చరణ్, నాని, నాగ చైతన్య వంటి హీరోస్ తో నటించిన అమల పాల్ ఈ మధ్య కాలంలో తెలుగులో కనిపించడం లేదు. పెళ్లి, విడాకుల తరువాత తెలుగులో నటించలేదు కానీ తమిళం, మలయాళం లో నటిస్తోంది. ఇక తన సినిమా కెరీర్ గురించి ఆసక్తికర వాఖ్యలు చేసింది అమల పాల్, కెరీర్ మొదట్లో తన కన్నా వయసులో పెద్ద అయిన హీరోలతో నటించినపుడు ఇబ్బంది పడ్డానని చెప్పింది.

అయితే వారి నుండి ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నానని అయితే కొన్ని ఇబ్బందులైతే ఎదుర్కొన్నానని చెప్పింది. ఇక కెరీర్ లో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే సక్సెస్ కోసం పాకులాడినట్లుగా అనిపించి సినిమాల మీద విసుగువచ్చింది, అందుకే సినిమాలు ఇక చేయకూడదని అనుకున్నాను. అయితే అదే సమయానికి మా నాన్న మరణించడం తో ఒక్కసారిగా క్రుంగిపోయాను. జీవితం అంటే భయమేసింది, ఏమ్ చేయాలో అర్థం కాలేదు. ఇక మళ్ళీ సినిమాల వైపు చుసాను. అయితే ఈ సారి సక్సెస్ కోసం కాకుండా నచ్చినట్టు సినిమాలను చేస్తున్నాను. నా కంటూ మంచి పేరు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాను అంటూ చెప్పింది అమల పాల్.

Bhargavi

Recent Posts

పిల్లలకు బెస్ట్ హెల్తీ స్వీట్ ఐడియా ఇదే.. పాలు, బెల్లంతో సూపర్ టేస్ట్.. సింపుల్ హోమ్ రెసిపీ!

ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్‌గా మారుతోంది. ముఖ్యంగా…

3 hours ago

నిద్రలో లేచి తింటున్నారా? సాధారణమా లేక ఆరోగ్య సమస్యా?

అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…

3 hours ago

వేసవిలో శరీరానికి కూలింగ్ కావాలా?దాహం, అలసటకు పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇదే!

వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్‌లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…

4 hours ago

ఖాళీ కడుపుతో వాకింగ్.. నిజంగా మంచిదేనా?

దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…

4 hours ago

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

2 days ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

2 days ago