Movie News

Sarathkumar: చిరంజీవి వల్లే నా అప్పులన్నీ తీరిపోయాయి… ఆయన చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను: శరత్ కుమార్

Sarathkumar: చిత్ర పరిశ్రమకు చెందిన వారు మాత్రమే కాకుండా ఎవరైనా అభిమానులు ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే ఆదుకోవడానికి ముందు వరుసలో ఉంటారు మెగాస్టార్ చిరంజీవి. ఈయన ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి రాలేదు.తన స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండస్ట్రీలో ఆగ్ర హీరోగా పేరు సంపాదించుకున్నారు.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా పుట్టిన రోజు జరుపుకోవడంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది ఆయనతో ఉన్న అనుభవాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే హాలీవుడ్ నటుడు శరత్ కుమార్ సైతం మెగాస్టార్ చిరంజీవికి మంచి స్నేహితుడు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శరత్ కుమార్ గతంలో మెగాస్టార్ గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఒకానొక సమయంలో తాను ఎన్నో అప్పుల్లో ఉండిపోయానని తెలిపారు. అయితే ఒక పేరు ఉన్న ప్రొడ్యూసర్ తన వద్దకు వచ్చి కేవలం చిరంజీవితో తనకు డేట్స్ ఇప్పిస్తే సినిమా నుంచి వచ్చే లాభాలలో తనకు వాటా ఇస్తానని చెప్పారు.అయితే చిరంజీవి ఒప్పుకుంటారో లేదో అన్న అనుమానంతో ఆయన వద్దకు వెళ్లి ఇది పరిస్థితి అని చెప్పగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా చిరంజీవి సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.

Sarathkumar: రెమ్యూనరేషన్ తీసుకోలేదు…

ఈ విధంగా ఈయన సినిమా చేయడానికి ఒప్పుకోవడమే కాకుండా ఆ సినిమాకి ఎలాంటి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. అంత మంచి మనసున్న వ్యక్తి చిరంజీవి అంటూ ఈయన మెగాస్టార్ గురించి చెప్పుకొచ్చారు. ఆరోజు చిరంజీవి చేసిన ఆ సాయం వల్లే తను చేసిన అప్పులు మొత్తం తీరిపోయాయని అతను చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేనని ఈ సందర్భంగా శరత్ కుమార్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago