Featured

Ambika Krishna : ఆ హీరోయిన్ కి బాగా పొగరు… బాలయ్య సినిమా షూటింగ్ లో అలా చేసింది.. అందుకే ఇపుడు సినిమాలు లేవు : ప్రొడ్యూసర్ అంబికా కృష్ణ

Ambika Krishna : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కి చెందిన అంబికా కృష్ణ అంబికా థియేటర్ నిర్వహిస్తు, అంబికా దర్భార్ భక్తి అగరవత్తుల ఫ్యాక్టరీ ఓనర్ గా కొనసాగుతూ సినిమా నిర్మాతగా కొన్ని సినిమాలను నిర్మించారు. కన్యాధానం, ఆడంతే అదో టైపు, జంప్ జిలాని, వీరభద్రం, ఒకే మాట, మనసున్న మారాజు వంటి సినిమాలను నిర్మించారు. తెలుగుదేశం పార్టీ లో చేరి పలు పదవులలో కొనసాగారు. ఇక నిర్మాతలు ఇపుడు ఎదుర్కొంటున్న సమస్యలు, హీరోలు, డైరెక్టర్ల గురించి మాట్లాడారు.

ఆ హీరోయిన్ కి పొగరు…

పాత రోజుల్లో సినిమా నిర్మాణం వేరేగా ఉండేది, నిర్మాతకు ఒక గౌరవం ఉండేది. ఇపుడు నిర్మాత అంటే కేవలం డబ్బు పెట్టి వెళ్లిపోవాలి సినిమాకు అంతే అంటూ కామెంట్స్ చేసారు. డైరెక్టర్, హీరో కలిసిపోయి ఎంత ఎక్కువ నిర్మాతతో ఖర్చు పెట్టిస్తే అంత అన్నట్లుగా చేస్తున్నారు. నిర్మాత కి ఖర్చు తగ్గిద్దామనే ఆలోచన లేదు. ఇక హీరోలు డైరెక్టర్లను కుడా డామినేట్ చేస్తున్నారు. కథలో మార్పులు అన్ని వారే సూచిస్తుంటారు. ఇంతకు ముందు అలా ఉండేది కాదు డైరెక్టర్ చెబితే అలా హీరోలు చేసే వారు. బాలకృష్ణ ఇప్పటికి అలానే ఉన్నారు. డైరెక్టర్ ఏమి చెబితే అది వింటాడు కానీ మారు మాట చెప్పడు అంటూ చెప్పారు. ఇక హీరోయిన్ల గురించి ప్రస్థావిస్తూ ‘వీరభద్ర’ సినిమా సమయంలో హీరోయిన్ తను శ్రీ దత్త చేసిన పనుల గురించి కామెంట్స్ చేసారు.

విదేశాల్లో షూటింగ్ షెడ్యూల్ జరుగుతుండగా ఉదయాన్నే షూటింగ్ కి సూట్ కేసు సర్దుకుని వచ్చింది. ఇంకాసేపటిలో షూటింగ్ మొదలవుతుంది అనగా నేను ఇండియా వెళ్ళాలి టికెట్ వేయమని అడిగింది. మా నాన్నకు సీరియస్ గా ఉంది వెళ్ళాలి అని చెప్పింది. హీరో తో సహా అందరూ షూటింగ్ కి ఎదురుచూస్తుంటే వినకుండా వెళ్లాలని పట్టుబట్టింది. ఇక ఒక పూట అంతా మాట్లాడి వాళ్ళ నాన్నతో మాట్లాడించి పర్వాలేదు అన్నాక వెళ్లడం మానుకుంది, చాలా పొగరు చూపిస్తారు ఇలాంటి వాళ్ళు. అంత పెద్ద హీరో అయినా బాలకృష్ణ ఎప్పుడు పొగరు చూపించరు. ఈ టైం కి షూటింగ్ అంటే ఆలస్యంగా వచ్చిన దాఖలాలు లేవు అంటూ చెప్పారు. ఇక బాలకృష్ణ కాకుండా వేరే నచ్చిన హీరోలంటే ఉపేంద్ర, శ్రీకాంత్ అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago