Movie News

Dhanush -Aiswarya: విడాకుల తర్వాత మొదటిసారి కలిసిన ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్… వైరల్ అవుతున్న ఫోటో?

Dhanush -Aiswarya: సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలం విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైంది. వివాహమై కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా కొన్ని జంటలు విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇలా విడాకులు తీసుకుని విడిపోయిన వారిలో కోలీవుడ్ జంట ఐశ్వర్య ధనుష్ జంట ఒకటి అని చెప్పాలి. వీరి వివాహమై దాదాపు 18 సంవత్సరాలు అయినప్పటికీ తాజాగా ఈ ఏడాది వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నామని ప్రకటించి అందరిని షాక్ కి గురిచేశారు.

ఈ విధంగా ఈ జంట విడాకులు తీసుకొని విడిపోతున్నామని ప్రకటించడంతో అభిమానులు ఎంతో బాధపడ్డారు. అయితే విడాకులు తీసుకున్న తర్వాత ఈ జంట ఎక్కడ కలిసి కనిపించలేదు అయితే తాజాగా ఐశ్వర్య ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర స్కూల్ ఫంక్షన్ లో భాగంగా వీరిద్దరూ సందడి చేశారు.ఈ క్రమంలోనే ఐశ్వర్య ధనుష్ తన పిల్లలతో కలిసి దిగిన ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ అవుతుంది.

ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఐశ్వర్య ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది నా పెద్ద కుమారుడు యాత్ర స్పోర్ట్స్ కెప్టెన్ గా ఎంపికవ్వడం ఆనందంగా ఉంది అంటూ ఆమె ఈ ఫోటోలను షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విడాకుల తర్వాత ఈ జంట ఇలా కుటుంబంతో కలిసి కనిపించడం అందరిని సంతోషానికి గురిచేసింది.

Dhanush -Aiswarya: కలిసుండాలని కోరుకున్న అభిమానులు..

ఈ విధంగా ఈ జంటను చూసిన అభిమానులు మీరెప్పుడూ ఇలాగే కలిసి ఉంటే బాగుంటుంది అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ఇకపోతే వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత ఎవరి వృత్తిపరమైన జీవితంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ధనుష్ కేవలం కోలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా హాలీవుడ్ టాలీవుడ్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అదేవిధంగా ఐశ్వర్య సైతం బాలీవుడ్ సినిమాలకు దర్శకురాలిగా చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago