S.S Thaman: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎస్ ఎస్ తమన్ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ప్రస్తుతం ఈయన వరుస సినిమాలకు కమిట్ అవుతూ సంగీత దర్శకుడిగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి గాడ్ ఫాదర్ సినిమాకి కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల చేశారు.
ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అదే స్థాయిలో పెద్ద ఎత్తున అభిమానులు నెటిజెన్ లు సంగీత దర్శకుడు తమన్ పై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విడుదలైన గాడ్ ఫాదర్ టీజర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒరిజినల్ కాదని ఈ మ్యూజిక్ వరుణ్ తేజ్ నటించిన గని టైటిల్ సాంగ్ కాఫీలా ఉందని పెద్ద ఎత్తున నెటిజన్లు తమన్ ను భారీ ట్రోలింగ్ చేస్తున్నారు.
అయితే తమన్ ప్రతి ఒక్క సినిమా విషయంలోనూ ఈ విధమైనటువంటి కాపీ ట్రోలింగ్ ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే గాడ్ ఫాదర్ విషయంలో మరోసారి ఇది రిపీట్ కావడంతో అభిమానులు ఏంటి తమన్ చూసుకోవాలి కదా.. మెగాస్టార్ సినిమాకి ఇలా కాపీ బీజిఎం ఇస్తే ఎలా…మెగాస్టార్ సినిమా పరిస్థితి ఇలా ఉంటే ఇతర హీరోల సినిమా పరిస్థితి ఏంటి అంటూ పెద్ద ఎత్తున ఇతనిని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.
ఈ విధంగా అభిమానులు పెద్ద ఎత్తున కాఫీ అంటూ తమన్ ను ట్రోల్ చేయగా ఇప్పటివరకు ఈ విషయంపై తమన్ ఏవిధంగాను స్పందించలేదు. అయితే తన తప్పును తెలుసుకొని సరిదిద్దుకుంటారా లేదంటే అలాగే వదిలేస్తారా తెలియాల్సి ఉంది.ఇకపోతే గాడ్ ఫాదర్ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇందులో సత్యదేవ్ నయనతార లుక్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.అయితే మెగాస్టార్ చిరంజీవి లుక్ విషయంపై అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…