పోసానిపై కేసు నమోదు.. ఎవరు పెట్టారో తెలుసా..?

రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ అంత్యంత ఆక్రోశంతో మాట్లాడిన విషయం తెలిసిందే. అటు ప్రభుత్వం సినీ పరిశ్రమపై చిన్న చూపు చూస్తుందని విమర్శించారు. తర్వాత దీనిపై ప్రతీ ఒక్కరూ స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ నాయకులు ఘాటుగా సమాధానం కూడా ఇచ్చారు.

అయితే ఇదే వ్యాఖ్యలపై పోసాని ప్రెస్ మీట్ పెట్టి వైకాపా కార్యకర్తగా స్పందించాడు. దీంతో పవన్ అభిమానులు అతడి ఇంటిపై కూడా దాడి చేశారు. ఆ తర్వాత రెండో సారి ప్రెస్ మీట్ పెట్టి.. పవన్ ఫ్యామిలీ విషయంలో కూడా తలదూర్చాడాని.. పోసానిపై దాడి చేసేందుకు కూడా పవన్ అభిమానులు వెనుకాడలేదు. కనిపిస్తే.. తీవ్రంగా కొట్టడానికైనా చూశారు.

దాని తర్వాత పవన్ అభిమానులపై పోసాని కేసు నమోదు చేస్తానంటూ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇదంతా ఇలా ఉండగా.. పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు పోసానిపై కేసు నమోదు చేశాడు. వైఎస్ఆర్ కార్యకర్తల నుంచి తానకు ప్రాణ హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి జనసేన కార్యకర్త అయిన రాజశేఖర్ ఈ ఫిర్యాదు చేశాడు.

వైకాపా కార్యకర్తలు తనను అవమానించారని.. పోసాని వ్యాఖ్యల తర్వాత ఇక్కడ తాము పవన్ అభిమానులమంటూ చెప్పుకొనే పరిస్థితి లేకుండా అయిందని అతడు వాపోయాడు. అతడి వ్యాఖ్యల వల్ల నాకు ప్రాణ హాని ఉందంటూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాజశేఖర్ ఫిర్యాదు చేశాడు. ఇటు పవన్ అభిమానుల నుంచి కూడా తనకు అసభ్యకరమైన మెసేజ్ లు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు.