శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మహాసముద్రం’ దసరా కానుకగా ఈనెల 14న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. దీనిని ‘ఆర్‌ఎక్స్ 100’ విజయం తర్వాత అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. ఆదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తున్నా.
జగపతిబాబు, రావురమేశ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సిద్ధార్థ్ మళ్లీ టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. భారీ బడ్జెట్తో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ స్వరాలు అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి.
అందులో ఉన్న డైలాగ్స్ ప్రతీ ఒక్కరికీ నచ్చేశాయి. దీంతో సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఎందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శర్వానంద్ మాట్లాడుతూ.. దీనికి కథే హీరో అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. అయితే ఈ చిత్రం థియేట్రికల్ విడుదల అనంతరం ప్రముఖ ఓటిటి దిగ్గజం ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.
డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ మంచి డీల్ కి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన తర్వాత దీనిని నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే ‘మహాసముద్రం’ చిత్రానికి పోటీగా దసరా బరిలో మరో రెండు సినిమాలు దిగుతున్నాయి. అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మరియు నాగశౌర్య ‘వరుడు కావలెను’ చిత్రాలు అక్టోబర్ 15న థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయి. ఈ మూడు చిత్రాల్లో ఏవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…