Pradeep : హెచ్ ఆర్ గా సత్యం లో పనిచేసా… స్కాం జరిగినపుడు ఏమి జరిగిందంటే….!

Pradeep : జంధ్యాల గారి దర్శకత్వంలో ముద్దమందారం సినిమాతో హీరోగా పరిచయమైన ప్రదీప్, ఆ తరువాత ఎన్నో సినిమాల్లో సహ నటుడుగా పనిచేసారు. ఇక పలు సీరియల్లలో నటించిన ప్రదీప్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలను నిర్వహిస్తు, యాంకర్ గా ఎదగాలనుకునే వారికి సహాయంగా వర్క్ షాప్స్ నిర్వహిస్తుంటారు. ఇక యూట్యూబ్ లో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటు ఆయన సినిమా ప్రయాణం గురించి చెబుతూనే పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు.

సత్యం కంపెనీ స్కాం గురించి…..

సినిమాలు, సీరియల్స్ గురించిన అనుభవాలను పంచుకున్న ప్రదీప్ 2006వ సంవత్సరంలో సత్యం కంప్యూటర్స్ లో హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ గా పనిచేసారు. 2008 లో సత్యం కంప్యూటర్స్ లో జరిగిన స్కాం గురించి అడుగగా, రామలింగ రాజు గారు కంపెనీలో అవకతవకలు జరుగుతున్నాయని పులి మీద స్వారీ చేస్తున్నాని, ఎప్పుడైనా పులి నన్ను మింగేస్తుందని చెప్పారు. అయితే కంపెనీ లో అప్పటికి 52,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే ఒక్కరిని కూడా తీసేయలేదు, ఆ సమయంలో హెచ్ ఆర్ గా ఉన్న నేను “వీ ఆర్ విత్ సత్యం” అంటూ ఉద్యోగులతో కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేసాను. ఇక రామలింగ రాజు గారు వెళ్ళిపోయాక సీఈఓ గా సత్య మూర్తి గారు వచ్చారు. ఆయన నాకు చాలా దగ్గరి మనిషి అందుకే ఆ సమయంలో ఆయనను వదిలి వెళ్లాలని అనిపించక అలాగే ఉద్యోగంలో కొనసాగాను. ఇక నాకు అక్కడ చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆఫీస్ పని చూసుకుంటూనే సీరియల్స్, సినిమాల్లో నటించేవాడిని అంటూ చెప్పుకొచ్చారు.

కొన్నేళ్లకు మానేసాను అయితే అప్పటికి కంపెనీ టెక్ మహీంద్రా చేతిలోకి వెళ్ళింది. ఉద్యోగస్థులు కొంతమంది వేరే కంపెనీలకు వెళ్లిపోయారు. అయితే ఏ ఒక్క ఎంప్లాయినీ తీసేయలేదు అంటూ సత్యం కంపెనీతో తనకున్న అనుబంధాన్ని చెప్పారు. ఇక ప్రదీప్ సినిమాలు, సీరియల్స్ లో నటించడమే కాకుండా మోటివేషనల్ ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తు ఉంటారు. ఇండియా మొత్తం మోటివేషనల్ క్లాస్ చెబుతూ ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. ఇక అవే కాకుండా యాంకరింగ్ కోసం వర్క్ షాప్స్ కూడా నిర్వహించడం లాంటివి చేస్తుంటారు.