Acharya: ఆచార్య నైజాం డిస్ట్రిబ్యూటర్ కి 14 కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చిన కొరటాల.. ఆచార్య తిప్పలు మామూలుగా లేవుగా?
Acharya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు డైరెక్టర్ కొరటాల శివ. రచయితగా సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈయన సినిమాతో దర్శకుడిగా మారారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కొరటాల అనంతరం శ్రీమంతుడు జనతాగ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకొని అపజయం ఎరుగని దర్శకుడు గా పేరు సంపాదించుకున్నారు.
ఈ క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కిన సినిమా ఆచార్య. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా థియేటర్ వద్ద విడుదల అయ్యి మొదటి షో తోనే ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. కొరటాల శివ దర్శకత్వంలో మెగా హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్లు సైతం కోట్లల్లో డబ్బులు ఖర్చు చేసి సినిమాని కొనుగోలు చేశారు.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కోవడంతో ఈసినిమా కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు పెద్దఎత్తున నష్టపోయారు. ఈ విధంగా నష్టపోయిన వారికి మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ రామ్ చరణ్ ఆర్థిక సహాయం చేశారని తెలుస్తోంది. ఇకపోతే వీరందరిలో కెల్లా నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను అధిక మొత్తంలో డబ్బును నష్టపోయినట్లు తెలుస్తోంది.
ఇలా వరంగల్ శీను ఆచార్య సినిమాని నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి కోట్ల రూపాయల నష్టపోవడంతో కొరటాల శివ ముందుకు వచ్చి వరంగల్ శీనుకి ఏకంగా 14 కోట్ల రూపాయలు రిటర్న్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. కొరటాల శివ తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ 30సినిమా మొదలు పెట్టడానికి ముందే ఇదంతా క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే వరంగల్ శీనుకి 14 కోట్ల రూపాయలను రిటర్న్ చేశారట. ఏది ఏమైనా ఇండస్ట్రీలో అపజయమే తెలియని కొరటాల శివకు ఆచార్య సినిమా ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని చెప్పవచ్చు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశకు గురి చేయడంతో ఎన్టీఆర్ సినిమా విషయంలో కొరటాల ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…