Ram Charan: వామ్మో రామ్ చరణ్ ధరించిన జాకెట్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎన్ని లక్షలో తెలుసా?
Ram Charan: సాధారణంగా సెలబ్రిటీలు వారి హోదాకు అనుగుణంగా వారు ఉపయోగించే వస్తువుల విషయంలో కూడా ఎంతో ఖరీదైన వస్తువులను, ఎంతో స్టైలిష్ గా ఉండే వాటిని ఉపయోగిస్తూ ఉంటారు.ఇలా వీటి కోసం లక్షల్లో ఖర్చు చేయడం మనం చూస్తున్నాము. ఇకపోతే త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం తన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు.
ఈ విధంగా రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన తర్వాత కాస్త హై ప్రొఫెషనల్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో శంకర్ దర్శకత్వంలో తన తదుపరి సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఆయన తన పదవ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఉపాసన రామ్ చరణ్ దంపతులు తమ పదవి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం కోసం ఈ దంపతులు ఇటలీ వెళ్లిన విషయం మనకు తెలిసిందే.
ఇటలీలో ఎంతో సరదాగా గడుపుతూ పెళ్లి రోజున ఘనంగా జరుపుకున్న అనంతరం తిరిగి ఈ జంట హైదరాబాద్ వచ్చారు.అయితే హైదరాబాద్ ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ మీడియా కంట పడటంతో ఒక్కసారిగా ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలలో రామ్ చరణ్ రా అని రాసి ఉన్న డెనిమ్ జాకెట్ ధరించారు. ఎంతో స్టైలిష్ లుక్ లో ఉన్నటువంటి రామ్ చరణ్ ఫోటో వైరల్ కావడంతో చాలా మంది ఆయన ధరించిన జాకెట్ ధర ఎంత అంటూ పెద్దఎత్తున సెర్చ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే రాంచరణ్ ధరించిన జాకెట్ ధర ఏకంగా 2600 డాలర్లు. మన భారతీయ కరెన్సీ ప్రకారం ఈ జాకెట్ ఖరీదు అక్షరాల రెండు లక్షల రూపాయలు. ఇలా ఈ జాకెట్ ధర రెండు లక్షల ధర ఉందని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. రామ్ చరణ్ నటించిన ఈ జాకెట్ ధరతో ఒక ఫ్యామిలీ ఏడాది పాటు ఎంతో సంతోషంగా గడప వచ్చని కామెంట్లు చేస్తున్నారు.
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…
నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…