Prathyusha : ప్రత్యూషని రేప్ చేసి చంపేస్తే జడ్జి 40,000 ఇవ్వమని చెప్పాడు… ఆయనకు దండం పెట్టి వచ్చేసా : సరోజినీ దేవి

Prathyusha : చిన్న పాత్రతో సినిమాల్లోకి అడుగుపెట్టిన తెలుగమ్మాయి ప్రత్యూష అనతి కాలంలోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కలుసుకోవాలని, స్నేహమంటే ఇదేరా వంటి సినిమాల్లో నటించిన ప్రత్యూష తమిళం వంటి ఇతర భాషల్లోను హీరోయిన్ గా అవకాశాలు అందుకుని కెరీర్ లో ముందుకు అడుగులేస్తున్న సమయంలో అర్థాంతరంగా మరణించింది. అనుమానస్పదంగా ప్రత్యూష మరణిస్తే ఆమె తల్లి సరోజినీ దేవి ఆమెకు న్యాయం జరగాలని ఇప్పటికీ పోరాడుతున్నారు. కానీ కూతురు చనిపోయి ఇరవై ఏళ్ళు దాటిపోయినా న్యాయం మాత్రం జరగలేదని బాధపడ్డారు. న్యాయం జరుగుతుందన్న నమ్మకం కూడా తనకు లేదని సరోజినీ దేవి కోర్ట్ జడ్జిమెంట్, సాక్ష్యాలను ఎలా మార్చారో ఇంటర్వ్యూలో వివరించారు.

రేప్ చేసి చంపేస్తే జడ్జి 40,000 ఇవ్వమన్నాడు…

ప్రత్యూష ఆత్మహత్య కాదు హత్య అంటూ మొదటి నుండి చెబుతున్న ప్రత్యుష తల్లి సరోజినీ దేవి గారు ప్రత్యూష మరణించిన వెంటనే నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్ట్ లో మునిస్వామి అనే డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ను అధికార దూర్వినియోగం చేసి ఎలా తారుమారు చేసారో చెప్పారు. మొదట విచారణ జరిపాక సిబిఐ కోర్ట్ సిద్ధార్థ రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే సిపిఐ నాయకులు బీవీ రాఘవులు గారి భార్య పుణ్యవతి గారు ప్రజాప్రయోజన వాజ్యం వేయడం తో నాంపల్లి సెషన్ కోర్ట్ కు కేసు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. అక్కడ మునిస్వామి గారి పోస్టుమార్టం రిపోర్ట్ ను పక్కన పెట్టి మళ్ళీ ప్రభుత్వం త్రిసభ్య కమిటీ అంటూ డాక్టర్లతో వేయించి ప్రత్యూష ఆత్మహత్య ద్వారా చనిపోయింది అసలు తన పై అత్యాచారం జరగలేదు అంటూ నివేదిక ఇచ్చారు. దీంతో ఆత్మహత్యకు ప్రేరేపించాడు కాబట్టి సిద్ధార్థ రెడ్డికి ఏడున్నరేళ్లు జైలు శిక్ష వేశారు. దీంతో సరోజినీ దేవి గారు హై కోర్ట్ ను ఆశ్రయించారు.

ఇక హై కోర్ట్ లో మొత్తం సాక్ష్యాలను హై కోర్ట్ లో భద్రపరుస్తున్నట్లు చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వకూడదని రూల్ పాస్ చేసి సిధార్థ రెడ్డి జైలు శిక్షను రెండున్నరేళ్లకు తగ్గించి ఆత్మహత్య గా మార్చారు. ప్రత్యూష చనిపోయింది కాబట్టి 40,000 నష్టపరిహారం ఇవ్వాలని ఆ జడ్జి తీర్పు ఇవ్వడం తో సరోజినీ దేవి ఆ నలభైవేలు తీసుకోడానికి నిరాకరించి అత్యాచారం జరిగి బ్రతికేవున్న బాధితులకు ఇవ్వండని చెప్పి వచ్చేసారట. ఇక సుప్రీం కోర్ట్ లో ప్రస్తుతం కేసు వేశారు సరోజినీ దేవి గారు కానీ బెంచ్ కి రానివ్వకుండా చెస్తున్నారని, న్యాయమూర్థిని పెట్టుకుంటాం అంటూ సిద్ధార్థ తరుపున వాళ్ళు కాలయాపన చేస్తున్నారు. న్యాయం దొరుకుతుందనే నమ్మకం నాకు లేదు అంటూ సరోజినీ దేవి గారు అభిప్రాయపడ్డారు. కానీ ఏం చేయకుండా ఉండకూడదు పోరాడాను అన్న తృప్తి అయినా నాకు మిగులుతుందని పోరాడుతున్నాను అంటూ చెప్పారు.