Priyadarshini Ram : ఆరోజు సోనియా గాంధీ అన్న ఒక్క మాట వైఎస్ జగన్ పార్టీ పెట్టడానికి కారణం…: ప్రియదర్శిని రామ్

Priyadarshini Ram : ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మొహం రెడ్డి రాజకీయ జీవితం తొలుతా కాంగ్రెస్ లోనే మొదలయింది. కాంగ్రెస్ నుండి పులివెందుల ఎంపీగా గెలిచిన ఆయన చివరికి కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చి పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నంత కాలం కాంగ్రెస్ లో కొనసాగగా జగన్ మాత్రం తిరుగుబాటు బావుటా ఎగరేయడానికి గల కారణాలను ఆయనకు సన్నిహితుడైన సాక్షి పేపర్ లవ్ డాక్టర్ ప్రియదర్శిని రామ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

సోనియా గాంధీ అన్న ఆ ఒక్క మాటే పార్టీ పెట్టడానికి కారణం…

రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన సమయంలో మొదట జగన్ ను సీఎం చేస్తారని అందరూ భావించినా అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయ్యారు. అయితే తండ్రి మరణించిన సమయంలో జగన్ ను కనీసం ఢిల్లీ పిలిచి సోనియా గాంధీ మాట్లాడలేదు అంటూ ప్రియదర్శిని రామ్ అభిప్రాయపడ్డారు. జగన్ కాంగ్రెస్ లో ఉంటూనే ఓదార్పు యాత్ర పేరుతో తెలంగాణ, ఏపీ లలో రాజశేఖర్ రెడ్డి మరణంతో చనిపోయిన పలువురికి కుటుంబాలను పరామర్శించాడు. అలా ఏపీ లో ఒక జిల్లా, తెలంగాణ లో ఒక జిల్లా అప్పటికే పరామర్శించిన ఆయనకు అనూహ్య స్పందన వచ్చిందని దీంతో సోనియా గాంధీ ఆయనను ఢిల్లీ కి రమ్మని పిలిచారని చెప్పారు రామ్.

అయితే ఢిల్లీ లో కుటుంబంతో వెళ్లగా సోనియా గాంధీ ఓదార్పు యాత్ర ఆపేయాలని, ఎవరైనా తన తండ్రి మరణం వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఉంటే వారిని పిలిపించుకుని డబ్బు ఇవ్వాల్సిందిగా చెప్పగా దుఃఖంలో ఉన్నవారిని నేను వెళ్లి ఓదార్చాలి కానీ నా దగ్గరకు పిలుచుకోవడం సంస్కారం కాదు కదా అని చెప్పారట. అయితే సోనియా గాంధీ అప్పటికే జగన్ ఓదార్పు యాత్ర చేయరాదు అని ఫిక్స్ అవడం వల్ల ఆయన మాటలకు ఒప్పుకోలేదట. దీంతో జగన్ బయటికి వచ్చేసారు. విజయమ్మ సోనియా కు నచ్చజెప్పినా ఆమె వినిపించుకోలేదట. బయటికి వచ్చాక మా నాన్న బ్రతికిన పార్టీ ఆ పార్టీ కి వ్యతిరేకంగా ఆ పార్టీలోనే ఉండి చేయలేను, అలా అని మా నాన్న కోసం ఆగిన గుండెలను పరామర్శించకుండా ఉండలేను అని పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు అంటూ ప్రియదర్శిని రామ్ తెలిపారు.