Producer Pokuri Baburao : రాజశేఖర్ మీద కోపంతో పిఎల్ నారాయణ పీక మీద గన్ పెట్టి కాల్చేశా… గొంతు నుండి రక్తం దారల కారింది…: నిర్మాత పోకూరి బాబురావు

Producer Pokuri Babu Rao : యువతరం కదిలింది సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన పోకూరి బాబు రావు గారిది ఒంగోలు. డైరెక్టర్ టి కృష్ణ గారు ఈయనకు సీనియర్ కావడం వల్ల కాలేజీలోనే పరిచయం, దాదాపు టి కృష్ణ గారు మరణించేవరకు కూడా ఆయనతోనే ఉన్న పోకూరి బాబు రావు గారు ఆయనతోనే పలు విప్లవ సినిమాలను చేసారు. ఎర్ర మందారం, నేటి భారతం, భారత నారి, ప్రజాస్వామ్యం వంటి విప్లవ సినిమాలను చేసిన టి కృష్ణ, పోకూరి బాబురావు ధ్వయం కృష్ణ గారు మరణించాక ఆయన కొడుకు గోపీచంద్ తో కలిసి యజ్ఞం, రణం సినిమాలను చేసారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన కెరీర్ అనుభవాలను పంచుకున్నారు.

రాజశేఖర్ మీద కోపంతో…

పోకూరి బాబు రావు గారు ఎక్కువగా రాజశేఖర్ గారితో సినిమాలను చేసారు. ‘అన్న’ సినిమా వాళ్లిద్దరి కాంబినేషన్ లో హిట్ సినిమా. మొదటి నుండి నటుడు రచయిత అయిన పిఎల్ నారాయణ గారితో మంచి అనుబంధం ఉండి చొరవగా మామ అని పిలిచేవారట పోకూరి బాబు రావు గారు. ఒకానొక సినిమా సమయంలో ఆయనను కాల్చడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఒక సినిమా షూటింగ్ సమయంలో ఒంగోలు దగ్గర మారుమూల పల్లెలో షూటింగ్ చేస్తుండగా జూనియర్ ఆర్టిస్ట్లు అందరూ సిద్ధంగా ఉన్నా హీరో రాజశేఖర్ ఇంకా షూటింగ్ కి రాలేదు. ఆ కంగారులో పోకూరి బాబు రావు గారు ఉండగా పిఎల్ నారాయణ గారు షూటింగ్ కోసమని తెచ్చిన డమ్మీ గన్ తీసుకుని ఒక జూనియర్ ఆర్టిస్ట్ తో వేళాకోళం చేస్తుండగా పోకూరి బాబు రావు గారి దృష్టికి విషయం వెళ్లి జూనియర్ ఆర్టిస్ట్ ని కాకుండా నిన్ను కాల్చాలి మామ అని నారాయణ గారితో అని గన్ తీసుకుని గుండెకు గురి పెట్టారట.

అయితే అనుమానము వచ్చి గన్ గాలిలోకి పేల్చగా అది డమ్మి అని తెలిసాక మళ్ళీ గన్ గోంతు దగ్గర పెట్టి కాలుస్తా అని చెప్తే నారాయణ గారు నీ చేతుల్లో చావడం కంటేనా అల్లుడు అని నిలుచున్నారట. కాల్చగానే గొంతు నుండి రక్తం కారడం మొదలవగానే టెన్షన్ వచ్చింది అయితే అదే సమయంలో హీరో రాజశేఖర్ రావడంతో ఆయన ప్రథమ చికిత్స అందించి హాస్పిటల్ కి తరలించడంతో గండం గడిచింది అంటూ బాబురావు తెలిపారు.