Featured

Actor Raj Kumar : చిరంజీవి గారు వాడిన కారు నేను కొన్నా… కారు నెంబర్ ఏంటంటే…: యాక్టర్ రాజ్ కుమార్

Actor Raj Kumar : రాజ్ కుమార్ ను తెలుగులో మొదట పరిచయం చేసింది దాసరి నారాయణ రావు గారు. అయన సినిమా ‘అమ్మ రాజీనామా’లో హీరోగా రాజ్ కుమార్ నటించారు. అయినా రాజ్ కుమార్ ను తెలుగు ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోలేదు కానీ కన్నడలో మాత్రం హీరోగా సక్సెస్ చూసారు రాజ్ కుమార్. తెలుగులో మాత్రం సినిమాల్లో కంటే సీరియల్స్ తో బాగాపేరు తెచ్చుకున్నారు. ఈటీవీలో విధి, జెమినీ లో పవిత్ర బంధం వంటి హిట్ సీరియల్స్ లో హీరోగా చేసారు. దాదాపు 12 సంవత్సరాలు బ్రేక్ లేకుండా సీరియల్స్ చేసిన ఆయన తెలుగులో హీరోగా హిట్ కొట్టాలనే కోరికతో ‘బారిష్టర్ శంకర్ నారాయణ’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాకు రాజ్ కుమార్ భార్య నిర్మాత అయితే ఫేమస్ కోరియోగ్రాఫర్ తార మాస్టర్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాజ్ కుమార్ డ్యూయల్ రోల్ లో చేసారు. ఈ సినిమా తెలుగులో ఎవరూ పట్టించుకోకపోయినా కన్నడలో మాత్రం సూపర్ హిట్ అయింది.

చిరంజీవి గారి కారు కొన్నాను…

రాజ్ కుమార్ గారి తండ్రి నెల్లూరులో టౌన్ షిప్ అధికారిగా ఉన్న సమయంలో వారుంటున్న ఒక్క వీధిలోనే చిరంజీవి గారి ఇల్లు ఉండేదట. సినిమాల్లోకి వెళ్తానని రాజ్ కుమార్ గారు తండ్రిని అడిగినప్పుడు మొదట్లో వద్దన్నా చివరికి ఒప్పుకుని చెన్నై లో ఇల్లు తీసి పెట్టారట. ఆ సమయంలోనే నెల్లూరులో చిరంజీవి గారి కారు అమ్ముతున్నారని తెలిసీ కొత్త కారు కొనాలనే ఆలోచన పక్కన పెట్టి ఆ కారు కొన్నారట. ఆ కారు నెంబర్ కూడా TSE2 గా ఉండేదట.

ఆ కారును రిపేర్ చేసి రాజ్ కుమార్ గారి కోసం చెన్నై కి పంపారట. అలా చచిరంజీవి గారు వాడిన కారు నేను వాడాను అంటూ చెప్పారు రాజ్ కుమార్. మొదట్లో తండ్రి సినిమాల్లోకి వద్దని చెప్పినా చివరకు ఆయనే ఇల్లు, కారు ఏర్పాటు చేసి నెల ఖర్చులకు డబ్బులిచ్చి ప్రయత్నించమని యాక్టింగ్ కోర్సులు వంటివి వద్దు నేరుగా ప్రయత్నించమని సలహా ఇచ్చారట. అలా దాసరి గారు పరిచయం అవడం అమ్మ రాజీనామా లో హీరోగా చేసారు రాజ్ కుమార్.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago