Kangana Ranaut: ఇక్కడ పుట్టినందుకు గర్వంగా ఉంది..! షాకింగ్ కామెంట్స్ చేసిన కాంట్రవర్సి క్వీన్!

Kangana Ranaut: ఇక్కడ పుట్టినందుకు గర్వంగా ఉంది..! షాకింగ్ కామెంట్స్ చేసిన కాంట్రవర్సి క్వీన్!

Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో నెపోటిజాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ  ఉంటుంది కంగనా. ఇటు సినిమాలతోనే కాకుండా వివాదాల్లో కూడా ఉంటుంది.

Kangana Ranaut: ఇక్కడ పుట్టినందుకు గర్వంగా ఉంది..! షాకింగ్ కామెంట్స్ చేసిన కాంట్రవర్సి క్వీన్!
Kangana Ranaut: ఇక్కడ పుట్టినందుకు గర్వంగా ఉంది..! షాకింగ్ కామెంట్స్ చేసిన కాంట్రవర్సి క్వీన్!

ఇటీవల రైతుల ఉద్యమంపై కొన్నివివాదస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిపై కొంతమంది మనోభావాలు దెబ్బతినడంతో కేసులు కూడా పెట్టారు. ఇదిలా ఉంటే రాజకీయంగా కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. జాతీయ భావాలు ఎక్కువగా ఉన్న కంగనా.. బీజేపీకి ఎక్కవగా ఫెవర్ గా ఉంటుందనే వాదనలు కూడా ఉన్నాయి. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం, శివసేన పార్టీపై కూడా పలు విమర్శలు చేసింది.

Kangana Ranaut: ఇక్కడ పుట్టినందుకు గర్వంగా ఉంది..! షాకింగ్ కామెంట్స్ చేసిన కాంట్రవర్సి క్వీన్!

ఇటీవల కంగనా చేసిన తలైవి సినిమా హిట్ అయింది. మరికొన్ని సినిమాలను ప్రస్తుతం చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా  జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సైతం  సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది ఈ ఫైర్ బ్రాండ్. స్వామి వివేకానందకు జయంతి సందర్భంగా అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది ఈ బ్యూటీ.

గురువుగా మిమ్మల్ని మించిన దేవుడు లేడు..

ప్రపంచానికి సహనం, సార్వత్రిక ఆమోదం రెండింటినీ బోధించిన మతానికి చెందినందుకు నేను గర్వపడుతున్నాను. మేము సార్వత్రిక సహనాన్ని విశ్వసించడం మాత్రమే కాకుండా.. మేము అన్ని మతాలను సత్యం అంగీకరిస్తామని రాసుకొచ్చింది. ఇప్పుడే కాకుండా ఇదివరకు కూడా కంగనా.. వివేకనందుడికి నివాళులు అర్పించారు. అందులో.. ‘నన్ను నేను పోగొట్టుకున్నప్పుడు మీరు నన్ను కనుగొన్నారు. ఇక్కడే ఉండేలా నా చేయి పట్టుకున్నారు. ఏ ఆశలేదని భ్రమపడ్డప్పుడు నాకో పర్పస్ ఉందని గుర్తు చేశారు. నా గురువుగా మిమ్మల్ని మించిన దేవుడు లేడు. నా జీవితం మొత్తం నీకు అంకితం’ అంటూ రాసుకొచ్చింది. గతంలో లవ్ ఎఫైర్ల, బ్రేకప్ లకు సంబంధించి తీవ్రమైన నిరాశలో ఉన్నప్పుడు వివేకనందుడి మార్గమే తనను మళ్లీ నిలబెట్టిందనే అర్థంతో ఈవ్యాఖ్యలు చేసి ఉంటుందని నెటిజెన్లు అనుకుంటున్నారు.