Pruthvi Kumar : పార్టీ కోసం టెర్రరిస్ట్ లాగా పనిచేసాను.. విజయ్ సాయికి ముందే చెప్పాను.. నన్ను బూటు కాలితో తన్నారు…!

Pruthvi Kumar : థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ తెలుగు సినిమాలో బాగా పాపులర్ అయిన పృథ్వీ సినిమాల్లో కమెడియన్ గా బాగా పేరు తెచ్చుకున్నాడు. ఇక రాజకీయాల్లో అడుగుపెట్టి వైసీపీ లో చేరి పార్టీ లో కష్టపడి పనిచేసి గుర్తింపు తెచ్చుకుని జగన్ కంట్లో పడ్డాడు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక టీవీ ఛానెల్ ఎస్విబిసీ ఛానెల్ కి చైర్మన్ గా నామినేటెడ్ పదవి లభించింది. పార్టీ లో పదేళ్ళు కష్టపడినందుకు నామినేటెడ్ పదవిని అందుకున్న పృథ్వీ దాన్ని నిలబెట్టుకోలేక పోయాడు. అక్కడ అక్రమాలకు పాల్పడ్డాడని, ఉద్యోగం ఇప్పిస్తానని లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆడియో లీకుల కలకలంతో వచ్చిన పదవి ఉడిపోయింది.

పార్టీ కోసం టెర్రరిస్ట్ లా పని చేశాను…

ఇక పదవి పోయాక పార్టీలో పక్కన పడేసారు పృథ్వీని. రాజకీయాల్లో ఉన్నపుడు సినిమా అవకాశాలను వదులుకున్నాడు. దీంతో అటు సినిమాలు పోయి ఇటు రాజకీయాల్లోను నిలబడలేక పోయాడు పృథ్వీ. ఇక ఈ మధ్యనే జనసేన పార్టీలో చేరిపోయాడు. అయితే వైసీపీ లో జరిగిన సంఘటనలకు క్లారిటీ ఇచ్చాడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. తిరుమల లో పని చేసినపుడు అక్కడ రాజకీయాలు చాలా చూసాను. అక్కడ జరిగే కుళ్ళు కుతంత్రాలు అన్నీ ఒక రిపోర్ట్ తయారు చేసి విజయ సాయి రెడ్డి కి కూడా ఇచ్చాను. అక్కడ మంచి కార్యక్రమాలు చేయాలని ప్రణాళికలు వేసుకున్నాను.

అందుకే నా మీద అక్కడ కొంతమంది కక్ష్య కట్టారు అలా నన్ను ఇరికించారు. ఇప్పటికి నేను అక్కడ జరిగే రాజకీయాలను తయారు చేసిన రిపోర్ట్ నాతో ఉంది కానీ నన్ను అటు సినిమాలకు కాకుండా చేసి బూటు కాలితో తన్ని బయటికి పంపినట్లు చేసారు. పార్టీ ప్రచార సమయంలో చాలా కష్టపడ్డాను. ఒక టెర్రరిస్ట్ లాగా పనిచేసాను, కానీ ఇలా నన్ను తన్ని బయటకు పంపినంత పని చేసారు. తిరుమలలో అక్రమ సొమ్ము రూపాయి తిన్నా వాళ్ళు ఎలాంటి చావు చూస్తున్నారో చూస్తున్నాము. నేను నిజంగా ఏదైనా తప్పు చేస్తే ఆ దేవుడు నన్ను వదలడు. ఇప్పటికీ కాణిపాకం వినాయకుడి ముందు కర్పూరం చేతిలో వెలిగించి నిజం చెప్పమని చెప్పినా చేస్తాను, నాకు భయం లేదు అంటూ చెప్పాడు పృథ్వీ.