Movie News

Swapna Dutt: నా జీవితంలో ఎన్టీఆర్ ను ఎప్పుడు మర్చిపోలేను.. పెళ్లి విషయంలో చాలా హెల్ప్ చేశాడు: స్వప్న దత్

Swapna Dutt: టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యానర్ ద్వారా ఎంతో మంది హీరోలు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను చేశారు.ఇక శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ కంత్రి శక్తి వంటి సినిమాలు చేశారు. ఇలా ఈ బ్యానర్ లో పలు సినిమాలలో నటించడం వల్ల ఎన్టీఆర్ కి అశ్విని దత్ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది.

ఇకపోతే అశ్విని దత్ చిన్న కుమార్తె స్వప్న దత్ ప్రస్తుతం శ్రీవైజయంతి మూవీస్ బ్యానర్ బాధ్యతలను తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈమె ఇప్పటికే నిర్మాతగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా ఈ బ్యానర్ లో వచ్చిన సీతారామం సినిమా కూడా మంచి హిట్ కావడంతో స్వప్న ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇక ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ స్వప్నను ప్రశ్నిస్తూ.. మీ పెళ్లిలో ఎన్టీఆర్ చేసిన హెల్ప్ ఏంటి అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తాను ప్రసాద్ వర్మ అనే వ్యక్తిని ప్రేమించాను.అయితే ఈ విషయం ఇంట్లో చెప్పడానికి సరైన టైమ్ కుదరకపోవడం లేదు అందుకే ఈ మేటర్ చెప్పడానికి కాస్త టైం తీసుకుందామని అనుకున్నాను.ఇలా నా లవ్ మేటర్ విషయంలో వెనకడుగు వేస్తున్న సమయంలో ఎన్టీఆర్ వచ్చి షూటింగ్ అయిపోగానే మేకప్ కూడా తీయకుండా నాన్నగారికి ఈ విషయం చెప్పేసారు.

Swapna Dutt: ఇలాంటి విషయాలు ఆలస్యం చేయకూడదు…

ఇలా లవ్ మేటర్ ఎక్కువగా డిలీట్ చేయకూడదు వెంటనే చెప్పేయాలి అంటూ తారక్ తన లవ్ మ్యాటర్ నాన్నకు చెప్పి ఎన్టీఆర్ నాన్నను ఒప్పించారని ఈ సందర్భంగా స్వప్న దత్ పేర్కొన్నారు.ఎన్టీఆర్ నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారని,తాను చేసిన హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఈ సందర్భంగా ఈమె తన పెళ్లి విషయంలో ఎన్టీఆర్ ఎలాంటి పాత్ర పోషించారు అనే విషయం గురించి ఈ సందర్భంగా వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago