Movie News

Actor Madhvan: వార్తలలో ఎలాంటి నిజం లేదు.. నేనేలాంటి ఆస్తులు అమ్ముకోలేదు… ఆ వార్తలకు చెక్ పెట్టిన మాధవన్!

Actor Madhvan: తెలుగు తమిళ భాషలలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మాధవన్ గత కొంతకాలం నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈయన స్వీయ దర్శకత్వంలో ది రాకెట్రి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రముఖ భారతీయ ఇస్రోశాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం.

ఇకపోతే ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఇక ఇప్పటికీ ఈ సినిమా పలుచోట్ల థియేటర్లలో రన్ అవుతుందని చెప్పాలి. ఇక ఈ సినిమా ద్వారా మాధవన్ దర్శకుడిగా మారడమే కాకుండా ఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇకపోతే ఈ సినిమా ద్వారా మాధవన్ భారీ నష్టాలను ఎదుర్కొన్నారని ఈ సినిమా వల్ల వచ్చిన నష్టాలను తీర్చడం కోసం ఏకంగా ఆయన ఆస్తులను కూడా అమ్ముకున్నారని వార్తలు వచ్చాయి.

ఇలా ఈ సినిమా నష్టాల నుంచి బయటపడటానికి మాధవన్ తాను నివస్తున్న ఇంటిని కూడా అమ్మకున్నారని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ఈ వార్తలపై ఈయన స్పందించారు. ఈ సందర్భంగా మాధవన్ మాట్లాడుతూ ఆ భగవంతుడి దయవల్ల తాను ఒక మంచి సినిమా చేశానని ఈ సినిమా వల్ల తాను ఎలాంటి నష్టాలను ఎదుర్కోలేదని ఈయన వెల్లడించారు.ఇకపోతే ఈ ఏడాది ది రాకెట్రీ సినిమా కోసం పనిచేసిన వారందరూ కూడా ప్రభుత్వానికి ఎక్కువగానే టాక్స్ చెల్లించి ఉంటారని ఈయన పేర్కొన్నారు.

Actor Madhvan: ఇల్లు అంటే ఎంతో ఇష్టం…

ఇకపోతే తనకు ఇల్లు అంటే ఎంతో ఇష్టం అలాంటిది తాను నివసిస్తున్న ఇల్లును కూడా అమ్మారని వస్తున్నటువంటి వార్తలలో ఏ విధమైనటువంటి వాస్తవం లేదని ఇప్పటికి తాను ఆ ఇంట్లోనే నివసిస్తున్నానని ఈ సందర్భంగా ఈయన క్లారిటీ ఇచ్చారు. ఈ విధంగా నేను ఆస్తులు అమ్ముకున్నాను అని వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని అవన్నీ ఆ వాస్తవాలేనని ఈయన కొట్టిపారేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago