Pulsar Bike Jhansi: టైలర్ వద్దకు వెళ్తే కొలతల విషయంలో తప్పుగా ప్రవర్తించాడు… కన్నీటి పర్యంతరమైన కండక్టర్ ఝాన్సీ!

Pulsar Bike Jhansi: గాజువాక డిపో బస్సు కండక్టర్ ఝాన్సీ పరిచయం అవసరం లేని పేరు.గాజువాక డిపోలో బస్ కండక్టర్ గా పని చేస్తున్నటువంటి ఈమెకు డాన్స్ పై ఎంతో ఆసక్తి ఉండడంతో ఎన్నో సంవత్సరాలుగా పలు స్టేజి పెర్ఫార్మన్స్ చేస్తూ అందరిని సందడి చేస్తున్నారు. అయితే ఈమెకు పల్సర్ బైక్ పాట మాత్రం చాలా అద్భుతమైన ఆదరణ తీసుకువచ్చింది.

ఈ పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయినటువంటి ఝాన్సీ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈమె సినిమా అవకాశాలను కూడా అందుకుంటు బిజీగా ఉన్నారు.ఇలా పల్సర్ బైక్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన ఝాన్సీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.

ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ అందరూ నేను ఓవర్ నైట్ స్టార్ అయిపోయానని భావిస్తున్నారు. కానీ ఈ హోదా వెనుక 18 సంవత్సరాల కష్టం ఉందని తెలిపారు.అలాగే తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనల గురించి కూడా తెలియజేశారు. ఒకరోజు తాను టైలర్ వద్దకు వెళ్తే ఆయన కొలతలు తీస్తూ తన పట్ల చాలా తప్పుగా ప్రవర్తించారు అంటూ ఈమె కన్నీటి పర్యంతరమయ్యారు.

Pulsar Bike Jhansi: మీ నాన్నని కాదని చెప్పు అన్నారు…

ఇక ఈ విషయం మా నాన్నకు చెప్పి ఆ టైలర్ కు బుద్ధి వచ్చేలా చేద్దామని తన తండ్రి దగ్గరకు వెళ్తే తన తండ్రి మాత్రం నేను మీ నాన్నని కాదని చెప్పు అంటూ మాట్లాడారని ఈ సందర్భంగా ఝాన్సీ తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుత ఈమె పలు స్టేజి షోలలో సందడి చేస్తూనే మరోవైపు సినిమా అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు.