Pulsar Bike Jhansi: గాజువాక డిపో బస్సు కండక్టర్ ఝాన్సీ పరిచయం అవసరం లేని పేరు.గాజువాక డిపోలో బస్ కండక్టర్ గా పని చేస్తున్నటువంటి ఈమెకు డాన్స్ పై ఎంతో ఆసక్తి ఉండడంతో ఎన్నో సంవత్సరాలుగా పలు స్టేజి పెర్ఫార్మన్స్ చేస్తూ అందరిని సందడి చేస్తున్నారు. అయితే ఈమెకు పల్సర్ బైక్ పాట మాత్రం చాలా అద్భుతమైన ఆదరణ తీసుకువచ్చింది.
ఈ పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయినటువంటి ఝాన్సీ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈమె సినిమా అవకాశాలను కూడా అందుకుంటు బిజీగా ఉన్నారు.ఇలా పల్సర్ బైక్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన ఝాన్సీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.
ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ అందరూ నేను ఓవర్ నైట్ స్టార్ అయిపోయానని భావిస్తున్నారు. కానీ ఈ హోదా వెనుక 18 సంవత్సరాల కష్టం ఉందని తెలిపారు.అలాగే తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనల గురించి కూడా తెలియజేశారు. ఒకరోజు తాను టైలర్ వద్దకు వెళ్తే ఆయన కొలతలు తీస్తూ తన పట్ల చాలా తప్పుగా ప్రవర్తించారు అంటూ ఈమె కన్నీటి పర్యంతరమయ్యారు.
ఇక ఈ విషయం మా నాన్నకు చెప్పి ఆ టైలర్ కు బుద్ధి వచ్చేలా చేద్దామని తన తండ్రి దగ్గరకు వెళ్తే తన తండ్రి మాత్రం నేను మీ నాన్నని కాదని చెప్పు అంటూ మాట్లాడారని ఈ సందర్భంగా ఝాన్సీ తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుత ఈమె పలు స్టేజి షోలలో సందడి చేస్తూనే మరోవైపు సినిమా అవకాశాలను అందుకొని బిజీగా ఉన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…