Pachalla Prakash : సినిమా ఇండస్ట్రీలో దాదాపుగా నలభై ఏళ్లుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఎన్టీఆర్ దగ్గరి నుండి నేటి రామ్ చరణ్ వరకు ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు పనిచేసిన పచ్చళ్ళ ప్రకాష్ గారు ఎన్నో సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసారు. దాదాపు 700 సినిమాలకు పనిచేసిన ఆయన మొదట్లో ప్రొడక్షన్ బాయ్ గా తన కెరీర్ మొదలు పెట్టిన పచ్చళ్ళ ప్రకాష్ గారు ఆయన పనిచేసిన స్టార్ హీరోల గురించి ఆయన అనుభవాల గురించి చెప్పారు.
ఎన్టీఆర్ గారికి నాన్ వెజ్ అంటే ఇష్టం…
సీనియర్ ఎన్టీఆర్ గారి వద్ద ‘నా దేశం’ సినిమాకు పనిచేశానని చెప్పిన ప్రకాష్ గారు ఆయనకు మొదట్లో భోజనం వడ్డించేవాడిని అంటూ చెప్పారు. ఆయన ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి ఉదయం ఐదు ఆ సమయంలోనే నాటికోడి కూరతో రాగి సంగటి అలాగే రాగి జావా తాగుతారు. ఆ తరువాత జిమ్ చేసి షూటింగ్స్ కి వెళ్తారు. మధ్యాహ్నం కూడా నాన్ వెజ్ ఉండాలని చెబుతారు. చేపలు, మటన్ ఇలా రకరకాల కూరలు ఉండాలి అంటూ ప్రకాష్ గారు చెప్పారు.
ఎన్టీఆర్ గారు నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టపడుతారు. ఆయన రోజూ ఏం తింటారో ముందుగానే చెప్పి తెప్పించుకుంటారట. ఇక ఆయన మర్యాద కూడా అలానే ఇస్తారంటూ ప్రకాష్ గారు తెలిపారు. చిన్న వారిని కూడా ఏమండి అనే పిలుస్తారు ఇక అలానే నాగేశ్వరావు గారు కూడా అంతే చాలా బాగా మర్యాద ఇస్తారు, బాగా చనువుగా మాట్లాడుతారు. ఇక కృష్ణ గారు చాలా మంచి మనిషి అంటూ తెలిపారు. ఆయన నేను ప్రొడక్షన్ మేనేజర్ గా ఉండకపోతే సినిమా చేయనని చెప్పేసారు అంత విలువ ఇస్తారు ఆయనకు అంటూ చెప్పారు ప్రకాష్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…