Trivikram Son: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా దర్శకుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేయడమే కాకుండా ఎన్నో సినిమాలకు రచయితగా కూడా పని చేశారు. ఇలా వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇండస్ట్రీలో వారసత్వం కొనసాగడం సర్వసాధారణం ఈ క్రమంలోనే ఇప్పటికి ఎంతో మంది హీరోల పిల్లలు హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అయితే ఇండస్ట్రీలో దర్శకుల పిల్లలు దర్శకుడిగాను హీరోగాను సక్సెస్ అయిన దాఖలాలు పెద్దగా లేవని చెప్పాలి.అయితే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇద్దరు కుమారులు కాగా ఇందులో ఒక అబ్బాయికి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని తాజాగా తన తన భార్య సౌజన్య వెల్లడించారు.
ఈ సందర్భంగా త్రివిక్రమ్ భార్య సౌజన్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన కుమారుడికి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని సన్నివేశాన్ని బట్టి ఆ సన్నివేశానికి ఏ కెమెరా వాడారు ఏ లెన్స్ వాడారు అనే విషయాలను చాలా అలవోకగా చెప్పేస్తారని సౌజన్య వెల్లడించారు.ఇలా సౌజన్య చెప్పే మాటలను బట్టి చూస్తే తప్పకుండా త్రివిక్రమ్ కొడుకు ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.
అయితే ఇప్పటివరకు దర్శకుల కుమారులు దర్శకులుగా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన సందర్భాలు లేవు కానీ ఈ రికార్డును త్రివిక్రమ్ కొడుకు బ్రేక్ చేస్తారేమో చూడాలి. తండ్రి సలహాలు సూచనల మేరకు త్రివిక్రమ్ కుమారుడు ఇండస్ట్రీలో సక్సెస్ సాధించిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ ఒక్కో సినిమాకు 30 నుంచి 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…