Jabardasth Komarakka : జబర్దస్త్ లో కమెడియన్ బాగా తెలిసిన కొమరం అనేకంటే కొమరక్క అనగానే గుర్తొస్తాడు. ముసలి వయసు మహిళగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ కామెడీ పండించిన కొమరం ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, చేస్తూనే యూట్యూబ్ ఛానెల్ ‘కొమరం టీవి’లో కామెడీ పండిస్తూనే అలాగే సినిమాలలోనూ నటిస్తున్నాడు. గడిచిన ఐదేళ్లలో నా కెరీర్ మారిపోయిందని నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నాను అంటూ కారులో ఎప్పటికైనా కూర్చోగలనా అనుకునే వాడిని కారు కొనుక్కోగలిగాను అంటూ ఎమోషనల్ గా సాగిన కొమరం ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న కష్టాలను తాను చూసిన అనుభవాలను పంచుకున్నారు.
కారు కొంటానా అని అనుకున్నాను…
మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక పల్లెలో పుట్టి పెరిగిన కొమరం చదువుకున్నది 10 క్లాస్. అయితే మిమిక్రి బాగా చేయగలడు. అయితే ఊర్లో పొలం చేసుకుంటూ హమాలీ పనికి పోతే నెలకు 6000 జీతం వస్తుంది జీవితం గడుస్తుంది అనుకున్న వాడికి భార్య హైదరాబాద్ కి పోయి పని వెతుక్కో, నీకు నచ్చిన పని చేయి వస్తే ఆనందంగా ఉంటావు లేకుంటే మళ్ళీ ఊర్లో పని చేసుకుంటావు అని ధైర్యం చెప్తే హైదరాబాద్ కి వచ్చి మొదట హోటల్ లో పనిచేస్తూనే మరోవైపు టీవీ ఛానెల్స్ చుట్టూ తిరిగేవాడట. అలా మొదట ఒక ఛానెల్ లో బిత్తిరి సత్తి అలియాస్ రవి కుమార్ తో కలిసి ఒక వార్తలు చదివే ప్రోగ్రామ్ చేసిన కొమరం ఆ తరువాత జబర్దస్త్ లో వెంకీ మంకీ టీం నుండి పిలుపుతో కెరీర్ మారింది. ఇక కిర్రాక్ ఆర్పీ టీంలో మాకు పశువులంటే ప్రాణం అనే స్కిట్ తో బాగా పేరొచ్చిందని కొమరం పంచుకున్నాడు. ఇక ‘దండోరా’ అనే ప్రోగ్రామ్ ద్వారా కొమరక్క గా బాగా పేరు వచ్చింది అంటూ చెప్పారు.
ఇండస్ట్రీలోకి రాక ముందు ఊర్లో మా బంధువు ఒకాయన కారు వేసుకుని వస్తే పిల్లలందరూ దాని వెంట పరుగు పెట్టేవారు. అపుడు అనుకునే వాడిని జీవితంలో ఎపుడైనా కారు ఎక్కగలనా అని కానీ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాక కారు కొన్నాను. దేవుడు దయ వల్ల కారు కొన్నపుడు చాలా ఆనందంగా అనిపించింది. పని ఉన్నపుడు హైదరాబాద్ లో ఉండి పని అయిపోయాక ఊరు వచ్చేసి పొలం పనులు చూసుకుంటూ కొమరక్క ఛానెల్ వ్లాగ్స్ చేస్తుంటాను. ఎంత సంపాదించినా ఊర్లో ఉండటమే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది అంటూ కమెడియన్ కొమరం తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…