Pushpa Movie: పుష్ప ప్రభావం మామూలుగా లేదుగా… రియల్ గా ఎర్రచందనం స్మగ్లింగ్.. చివరికి ఇలా!

Pushpa Movie: పుష్ప ప్రభావం మామూలుగా లేదుగా… రియల్ గా ఎర్రచందనం స్మగ్లింగ్.. చివరికి ఇలా!

Pushpa Movie:క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా కొంత మంది ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకోగా మరికొందరు ఈ సినిమా పై విమర్శలు చేశారు.

Pushpa Movie: పుష్ప ప్రభావం మామూలుగా లేదుగా… రియల్ గా ఎర్రచందనం స్మగ్లింగ్.. చివరికి ఇలా!
Pushpa Movie: పుష్ప ప్రభావం మామూలుగా లేదుగా… రియల్ గా ఎర్రచందనం స్మగ్లింగ్.. చివరికి ఇలా!

ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంటే ఆ సినిమా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ అలాకాకుండా సమాజంలో యువత తప్పు దోవ పట్టించే విధంగా ఉండకూడదని గరికపాటి నరసింహారావు ఈ సినిమా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో హీరో ఒక స్మగ్లర్ ఆయన కూడా తగ్గేదిలే అంటూ స్మగ్లింగ్ చేస్తారు. ఇలా చేయటం వల్ల సమాజానికి ఏమి తెలియచేస్తున్నారు అంటూ గరికపాటి ఈ సినిమా పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pushpa Movie: పుష్ప ప్రభావం మామూలుగా లేదుగా… రియల్ గా ఎర్రచందనం స్మగ్లింగ్.. చివరికి ఇలా!

ఇలా ఈయన ఈ సినిమా గురించి ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే నిజజీవితంలో కూడా ఈ సినిమాను చూసి ఇన్స్పయిర్ అయిన ఒక ట్రక్ డ్రైవర్ ఏకంగా గంధపుచెక్కల స్మగ్లింగ్ చేసిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. యాసిన్ ఇనయితుల్లాఅనే వ్యక్తి ట్రక్కు డ్రైవర్ గా పని చేస్తూ ఇటీవలే పుష్ప సినిమాను చూసిన తర్వాత తాను కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడానికి పథకం వేశాడు.

2 కోట్లు విలువ చేసే ఎర్ర చందనం…

ఆంధ్ర- కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో అతను స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర మార్గమధ్యంలో పోలీసులు అతనిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అతని నుంచి సుమారు 2.45 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడమే కాకుండా 10 లక్షల వరకు కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు. అయితే ఇలా రియల్ గా ఎర్రచందనం స్మగ్లింగ్ జరగడంతో పుష్ప సినిమా ప్రభావం అంటూ ఈ వార్త సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ గా మారింది.