Featured

Actress Sudha: వ్యభిచారం చేయడానికి కూడా పనికిరావన్నారు… ఆ కొరియోగ్రాఫర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సుధ!

Actress Sudha: టాలీవుడ్ ఇండస్ట్రీలో తల్లి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే నటి సుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తల్లి పాత్రలో నటించడం కాకుండా జీవించిందని చెప్పాలి. ఇలా ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న సుధ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన జీవితంలో జరిగిన ఒక అవమానకర ఘటన గురించి తెలియజేశారు.

Actress Sudha: వ్యభిచారం చేయడానికి కూడా పనికిరావన్నారు… ఆ కొరియోగ్రాఫర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సుధ!

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమిళంలో ఒక సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో తనకు ఎంతో అవమానం జరిగిందని తెలిపారు. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తండ్రి సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ చేశారని ఈమె వెల్లడించారు.ఆయన కొన్ని వందల సినిమాలకు కొరియోగ్రఫీ చేయడమే కాకుండా దర్శకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు.

Actress Sudha: వ్యభిచారం చేయడానికి కూడా పనికిరావన్నారు… ఆ కొరియోగ్రాఫర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సుధ!

ఇలా ఈ సినిమాలో ఆ పాటకు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ చేశారని అయితే ఆ పాట షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక మూమెంట్ తనకు ఎంత కష్టపడినా రాలేదని తెలిపారు. సుమారు ఆ మూమెంట్ చేయడం కోసం నాలుగైదు టేకులు తీసుకున్నానని అయినా ఆ మూమెంట్ చేయడం తనకు రాలేదని తెలిపారు.

స్వయంగా మాస్టరే క్షమాపణలు చెప్పారు..

ఇలా ఎక్కువసార్లు టేకులు తీసుకోవటం వల్ల సుందరం మాస్టర్ ఛీ…. నువ్వు వ్యభిచారం చేయడానికి కూడా పనికిరావు అంటూ తనని దారుణంగా అవమానించారని ఈ సందర్భంగా బయటపెట్టారు.ఇలా లొకేషన్ లో ఎంతో మంది పెద్దలు ఉన్నప్పటికీ తనని అలా అనడంతో తనకు ఎంతో అవమానంగా అనిపించిందని ఇక అక్కడి నుంచి ఏడుస్తూ ఇంటికి వెళ్లి అమ్మకు జరిగినదంతా చెప్పానని సుధా తెలిపారు.తన మాటలు విన్న తన తల్లి రేపొద్దున తను దర్శకుడు అయిన తర్వాత తన సినిమాల్లో నటించమని నీ దగ్గరకు వస్తారు అప్పుడు దానికి సమాధానం నీ నటనతోనే చెప్పాలని తెలియజేశారు. ఇలా అనుకున్న విధంగానే తను దర్శకుడయ్యారు తన సినిమాలో నటించమని అడగడానికి వస్తే అమ్మ చెప్పిన ప్రకారం నటించాను. సింగిల్ టేక్ లో షాట్ ఓకే కావడంతో స్వయంగా సుందరం మాస్టర్ ఏ తన దగ్గరకు వచ్చి ఆ రోజు అలా మాట్లాడినందుకు నన్ను క్షమించు అంటూ క్షమాపణలు చెప్పారని ఈ సందర్భంగా సుధా తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago