బైక్ రేస్ పై వస్తున్న వార్తలు అబద్దం.. ఆ వార్తలను ఖండించిన డీసీపీ ..

శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో సాయి ధరమ్ తేజ్ చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే వైద్యులు అతడి ఆరోగ్య బులెటిన్ ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉన్నారు. ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని.. ట్రీట్ మెంట్ కు సాయి ధరమ్ తేజ్ సహకరిస్తున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. బైక్ రేస్ కారణంగానే అతడు ప్రమాదానికి గురైనట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ గా మారాయి. సీనియర్‌ నటుడు కుమారుడు నవీన్‌, సాయితేజ్‌ రేసింగ్‌ పెట్టుకొని డ్రైవింగ్‌ వెళ్లారనే వార్తలు వినిపించాయి. ఈ వార్తలను మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు కొట్టిపారేశారు.

దుర్గం చెరువు బ్రిడ్జి మీద ఉన్న సీసీ టీవీ పుటేజీని తాము పరిశీలించామని.. అక్కడ కేవలం సాయి ధరమ్ తేజ్ ఒక్కరే వెళ్తున్నారని.. రేసింగ్ అంటూ వస్తున్న వార్తలు పచ్చి అబద్దమని.. వాటిని నమ్మొద్దంటూ.. ఫేక్ వార్తలంటూ కొట్టి పారేశారు. అతడు వెళ్తున్న మార్గంలో అతడి కంటే ముందు ఒక ఆటో మాత్రమే వెళ్తుందని.. దానిని ఓవర్ టేక్ చేసే క్రమంలో అక్కడ ఇసుక ఉండటంతో బైక్ స్కిడ్ అయి పడిపోయాడంటూ చెప్పుకొచ్చాడు.

తలకు హెల్మెట్ ధరించడంతో తలకు ఎలాంటి దెబ్బలు తగల్లేదని చెప్పాడు. ఆ ఆటోను ఎడమ వైపు నుంచి కాకుండా కుడివైపు నుంచి ఓవర్ టేక్ చేయడంతో ఇలా జరిగిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఈ ప్రమాదంపై అతడిపై ట్రాఫిక్ ఉల్లంఘల కింద పోలీసులు రెండు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.